ఆంధ్రప్రదేశ్

రేపు నిర‌స‌న‌ల‌తో హోరెత్తించండి.. టీఆర్ఎస్ శ్రేణుల‌కు కేసీఆర్ పిలుపు

  • కేంద్రం పెంచుతున్న ధ‌ర‌ల‌పై టీఆర్ఎస్ నిర‌స‌న‌లు
  • అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు
  • పార్టీ శ్రేణుల‌కు కేసీఆర్ పిలుపు

కేంద్ర ధ‌ర‌ల పెంపున‌కు నిర‌స‌న‌గా గురువారం నాడు తెలంగాణ‌వ్యాప్తంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్ట‌నుంది. రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో జ‌ర‌గ‌నున్న ఈ నిర‌స‌న‌ల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో పాలుపంచుకోవాల‌ని, నిర‌స‌‌నల‌ను హోరెత్తించాల‌ని ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

హ‌ద్దు ప‌ద్దు లేకుండా కేంద్ర ప్ర‌భుత్వం గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతోంద‌ని ఆరోపించిన టీఆర్ఎస్… ఆ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు నిర‌స‌న‌గానే రేపు ఆందోళ‌న‌లు చేపట్టనుంది. ఇప్ప‌టికే యాసంగిలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వాదిస్తున్న కేసీఆర్‌.. తాజాగా ధ‌ర‌ల పెరుగుద‌ల అంశంపై కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన‌ట్లుగా విశ్లేష‌ణలు సాగుతున్నాయి.

Related posts

చంద్రబాబుకు మద్దతుగా రేపు హైదరాబాద్‌లో వినూత్న నిరసన.. ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’

Ram Narayana

ప్రతిభతో పేటీఎం చీఫ్ కంట్లో పడ్డ ఏడేళ్ల బాలిక!

Drukpadam

ఒంటి నిండా కుమార్తె పేరుతో పచ్చబొట్లు.. ప్రపంచ రికార్డ్

Ram Narayana