Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మిస్టరీగా మారిన చైనా విమాన ప్రమాద ఘటన!

మిస్టరీగా మారిన చైనా విమాన ప్రమాద ఘటన!

  • సోమవారం కూలిపోయిన చైనా విమానం
  • విమానంలో 132 మంది
  • పర్వత ప్రాంతంలో కూలి దగ్ధమైపోయిన విమానం
  • ఇప్పటివరకు ఒక్క మృతదేహం కూడా లభ్యంకాని వైనం

చైనాలో ఇటీవల 132 మందితో వెళుతున్న బోయింగ్ విమానం ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాద ఘటన ఓ మిస్టరీగా మారింది. ఇప్పటివరకు ఆ విమానంలోని వారి ఆచూకీ తెలియరాలేదు. వారి మృతదేహాలు కూడా లభ్యం కాలేదు.

విమాన ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), ఫ్లయిట్ డేటా రికార్డర్ (ఎఫ్ డీఆర్) ఎంతో కీలకం. ఈ బ్లాక్ బాక్స్ లను విశ్లేషిస్తే విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ను కనుగొన్న సహాయక బృందాలు, తాజాగా ఫ్లయిట్ డేటా రికార్డర్ ను కూడా స్వాధీనం చేసుకున్నాయి.

కాగా, ఈ విమానం గాల్లోనే అధిక పీడనంతో పేలిపోయి నేలకూలి ఉంటుందని భావిస్తున్నారు. విమానం కూలిపోయిన ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలో ఓ శకలాన్ని గుర్తించారు. ఆశ్చర్యకరంగా మృతదేహాలేవీ లభ్యం కాలేదు. దాంతో ఈ విమాన ప్రమాద మృతులపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే విమానం కూలిపోయి, దగ్ధమైన తీరు చూస్తుంటే ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండే అవకాశాల్లేవని తెలుస్తోంది.

Related posts

వివేకా హత్యకేసు… సిబిఐ కి చిక్కిన సునీల్ యాదవ్!

Drukpadam

మహిళకు వేధింపులు ఎస్ ఐ కి పనిషమెంట్ …!

Ram Narayana

చర్యలు తప్పవు.. గురుద్వారాలో మోడల్ ఫొటోషూట్‌పై పాక్ తీవ్ర హెచ్చరిక!

Drukpadam

Leave a Comment