రాజకీయ వార్తలు

రాష్ట్రపతి రేసులో వెంకయ్య నాయుడు, గులాంనబీ ఆజాద్ ఉన్నారా ?

రాష్ట్రపతి రేసులో వెంకయ్య నాయుడు, గులాంనబీ ఆజాద్ ఉన్నారా ?
-సోషల్ మీడియా లో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించినట్లు ప్రచారం
-అది నిజం కాదన్నా ఉపరాష్ట్రపతి కార్యాలయం
-గులాంనబీ ఆజాద్ ను మోడీ రాష్ట్రపతిని చేయనున్నారా?
-అందుకే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటున్నారా ?

రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పదవీకాలం జులై నెలలో ముగుస్తుంది. ఈలోగా రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది. కాబోయే రాష్ట్రపతి ఎవరు ? రేసులో ఎవరెవరు ఉన్నారు ? బీజేపీ ఎవరిని చేయాలనీ అనుకుంటుంది అనేది ఆశక్తికరంగా మారింది. రామనాథ్ కోవింద్ ని తిరిగి మరోసారి రాష్ట్రపతిని చేసే అవకాశం ఉండవచ్చునని రాజకీయపరిశీలకుల అభిప్రాయం . మరోపక్క ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిగా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు . కొన్ని రోజుల క్రితం వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిగా నిర్ణయించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఉపరాష్ట్రపతి గా ఉన్న వెంకయ్య నాయుడు కూడా చాలాసార్లు ప్రజలతో సంబంధం లేని పదవి ఇష్టం లేదని చెప్పారు . అయినప్పటికీ వెంకయ్య నాయుడు అనుభవాలు దృష్టిలో పెట్టుకోవడంతో పాటు దక్షిణాదికి చేయండిన వ్యక్తి అయినందున ఆయనవైపు బీజేపీ మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ప్రతిపక్షాల నుంచి ఎవరు అభ్యర్థిగా ఉంటారనేది ఇంకా ఒక అంచనాకు రాలేదు . ప్రతిపక్షాలు కలిసి పోటీచేస్తాయా విడివిడిగా పోటీచేస్తాయా అనేది కూడా తేలని విషయంగా ఉంది. బీజేపీ కూడా కొత్త అభ్యర్థి అన్వేషణలో ఉందా? లేక తిరిగి రామనాథ్ కోవింద్ కే మరో అవకాశం ఇస్తుందా ? అనేది ఉంది. లేక మైనార్టీ కోట నుంచి గులాంనబీ ఆజాద్ ను పెట్టె అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆజాద్ బీజేపీ కి ప్రధానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఆయన కూడా ఇటీవల ఒకసమావేశంలో రాజకీయాలనుంచి తప్పుకొని సేవ కార్యక్రమాలు చేయాలనీ అనుకుంటున్నట్లు తెలిపారు . దీంతో బీజేపీ గులాం నబి ఆజాద్ కు ఏమైనా ఆఫర్ ఇచ్చిందా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. అందువల్ల రామనాథ్ కోవిందా? వెంకయ్య నాయుడా? లేక ఆజాదా ? కొత్తగా మరొకరిని తెరపైకి తెస్తారా ? అనే ఆశక్తి నెలకొన్నది …

Related posts

ఒక్క మాటలో చెప్పాలంటే… దేశానికే దండగ మీరు!: కిషన్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్!

Drukpadam

ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

Drukpadam

నా రాజీనామాతోనే మునుగోడుకు ప్రభుత్వం కదిలి వచ్చింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

Drukpadam