Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ సర్కార్ కో నిఖాలో…తెలంగాణ కో బచావో తుక్కుగూడ సభలో అమిత్ షా పిలుపు !

కేసీఆర్ సర్కార్ కో నిఖాలో…తెలంగాణ కో బచావో తుక్కుగూడ సభలో అమిత్ షా పిలుపు !
కేసీఆర్ సర్కార్ అవినీతి లో కురుకపోయిందన్న అమిత్ షా
తెలంగాణ నిజాం కేసీఆర్ ను తరిమికొడదాం అని పిలుపు
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపణ
కొడుక్కి ,కూతురుకి అధికారాలు ఇచ్చిన కేసీఆర్ సర్పంచులకు ఇవ్వలేదని ధ్వజం
బీజేపీ అధికారంలోకి వస్తే నీళ్లు ,నిధులు ,నియామకాలు ఉంటాయని హామీ
రైతు పండించిన ప్రతిగింజ కొంటాం
ముస్లింల రిజర్వేషన్ లు రద్దు చేస్తాం …ఎస్సీ ,ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాం

 

కేసీఆర్ సర్కార్ కో నిఖాలో …తెలంగాణ కో బచావో అని కేంద్ర హోమ్ మంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా పిలుపు నిచ్చారు….అవినీతితో నిండిపోయిన , వాగ్దానాలు నెరవేర్చని , మజ్లీస్ కు లొంగిపోయిన టీఆర్ యస్ సర్కార్ ను వదిలించుకోవాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని ఏంటి షా అన్నారు . బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండొదశ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ సర్కార్ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమల్లో పూర్తిగా విఫలమైయ్యారని ధ్వజమెత్తారు . ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి రజాకార్ల ప్రతినిధులతో స్నేహం చేస్తున్న కేసీఆర్ ను గద్దెదించి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని అన్నారు . కేసీఆర్ ను గద్దె దించేందుకు మేము ఇక్కడకు రానక్కర్లేదని బండి సంజయ్ ఒక్కడు చాలని అన్నారు . కేసీఆర్ మోసాలను ప్రజలకు తెలియజెప్పాలని వచ్చామని పేర్కొన్నారు .దళితులకు మూడు ఎకరాల భూమి , నీళ్లు నిధులు , నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు .

ఈ యాత్ర ఎవరినో గద్దె దించడానికి కాదు … ప్రజల సంక్షేమ కోసం ….రజాకార్ల ప్రతిధులతో స్నేహం చేసినవారికి వ్యతిరేకంగానే ఈ యాత్ర ….పేదల ,బడుగు ,బలహీనవర్గాల కోసం ఈ యాత్ర ….మజ్లీస్ కు లొంగిపోయిన కేసీఆర్ ను గద్దె దించడం కోసం ఈ యాత్ర…..
నీళ్లు , నిధులు …నియామకాలు కోసం ఈ యాత్ర .బీజేపీ వస్తే వాటిని నెరవేరుస్తుందని అన్నారు .
కేసీఆర్ సచివాలయానికి వెళ్లారు …ఇక వెళ్ళలేరు ..మీ కొడుక్కి అధికారం ఇచ్చారు . సర్పంచ్ లకు ఇవ్వలేదు … మోడీ సర్కార్ ధాన్యం కొనడం లేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు . … హైద్రాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అన్నారు … ఎక్కడ నిర్మించారు అని నిలదీశారు . ఖమ్మంలో సాయి గణేష్ ఆత్మహత్య కారణమైన హంతకులకు శిక్ష పడేలా చేస్తాం అని కేంద్ర హోమ్ మంత్రి పేర్కొన్నారు

తెలంగాణ ను బెంగాల్ చేయాలనీ కేసీఆర్ చూస్తున్నారు … అది సాధ్యం కాదు … బీజేపీ అందుకు అంగీకరించదు హెచ్చరించారు .

కేంద్రం పథకాలు అమలు చేయడంలేదు … బీసీలకు 5 లక్షల వరకు ఆరోగ్య కోసం అమలు అవుతున్నాయా ? లేదు .. ప్రతిపథకం మీద కొడుకు , కూతురు ఫోటో పెట్టుకుంటున్నారు . ఆయుష్మాన్ భారత్ ను అడ్డుకుంటున్నారు . …తెలంగాణ అభివృద్ధి మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకోసం 2 .50 లక్షల కోట్లు ఇచ్చింది. అయిన కేంద్రం ఇమి ఇవ్వడంలేదని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు .

తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మైనారిటీ రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేసి… ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

బీజేపీ కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్ …ప్లీజ్ …ప్లీజ్ … బండి సంజయ్

అవినీతి , నికృష్ట పాలనను అంతమొందిద్దాం …ఒక్కసారి అవకాశం ఇవ్వండి.ప్లీజ్ ,ప్లీజ్ …….. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో సమస్యలు వలయంలో చిక్కుకుంది. …మాఫియాలకు అడ్డాగా మారింది., … శ్రీలంక పరిస్థితి వచ్చింది. …. పాలమూరు ఎడారిగా మారింది….జి ఓ 69 అమలు చేయలేదు …ఆర్డీఎస్ ను ఆధునీకరించి నీరుకి ఇస్తాం….అలంపూర్ కు నీళ్లు ఇస్తామని అన్నారు . … కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు …. అన్ని శాఖలు కుటుంబానికే … నియోజకర్గానికి లక్ష ఎకరాలకు నీరు ఇస్తానన్నారు 2018 హామీ ఇచ్చారు …ఎక్కడ ఇచ్చారు …బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రధాని ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మిస్తాం … ఎన్ని లక్షల ఇల్లు అయినా బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు …. నిరుద్యోగులకు ఉద్యోగాలు …. పెట్రోల్ పై వ్యాట్ తగ్గిస్తాం … పేదలను ఆదుకుంటాం … ఫసల్ బీమా యోజన కింద రైతులను ఆదుకుంటాం … టీఆర్ యస్ ,ఎం ఐ ఎం లకు కాంగ్రెస్ ఓటు వేస్తె ….. అందరు ఒక్కటే … అందువల్ల వారికీ ఓట్లు వేయద్దు బీజేపీ కి ఓటు వేయడం ద్వారాన్ని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు . ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఎమ్మెల్యే లు రాజా సింగ్ ,
ఈటల రాజేందర్ , బీజేపీ నేతలు అరుణ , మురళీధర్ రావు , పొంగులేటి సుధాకర్ రెడ్డి ,లక్ష్మణ్ ,జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు .

Related posts

అమెరికా మీడియా కంటే భారత్ మీడియా బెటర్ … అమెరికా అధ్యక్షుడు జో బైడెన్!

Drukpadam

యువనేతలు పార్టీని వీడుతుంటే.. అదేమిటో మమ్మల్ని నిందిస్తారు: కాంగ్రెస్‌పై కపిల్ సిబల్ ఫైర్!

Drukpadam

అగ్నిపథ్​ పై కాంగ్రెస్​ సత్యాగ్రహం… ఢిల్లీ జంతర్​మంతర్​ దగ్గర దీక్ష !

Drukpadam

Leave a Comment