Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా వ్యాప్తి నివారణకు మాస్క్ తప్పనిసరి-సి పి విష్ణు ఎస్ వారియర్

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ స్పష్టం చేశారు. గడిచిన పదిహేను రోజులుగా దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి ఉధృతిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.

ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రణకు మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ..
షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, పరిశ్రమల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని,
చేతులను శుభ్రం చేసుకోడానికి శానిటైజర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా మాస్క్‌లు ధరిస్తేనే లోనికి అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా భౌతికదూరం నిబంధనలు విధిగా పాటించే విధంగా చర్యలు తీసుకొవాలని సూచించారు.

పోలీసు సిబ్బంది స్వయంగా కోవిడ్ నిబంధనలు పాటించడం, కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం తద్వారా కోవిడ్ వ్యాప్తి వలన గతంలో ఎదుర్కొన్న సమస్యలు, కష్టనష్టాలు,
ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి ప్రజలకు వివరిస్తూ..మాస్క్‌ ధరించడం, భౌతిక ధూరాన్ని పాటించే అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి నుండి బయటకు వచ్చేవారు మస్క్ ధరించడంలో అలసత్వం వహిస్తే, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పోలీస్ అధికారులకు సూచించారు.
కోవిడ్ మహమ్మారి నిర్మూలనకు మనము తీసుకునే జాగ్రత్తలే కీలకమైనదనే విషయాన్ని
వివిధ శాఖలు, స్వచ్చంద సంస్థల సమన్వయంతో విసృత్తంగా ప్రచారం చేస్తూ..
ముందుకు సాగాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల దృశ్య
బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో (ఆర్టీసీ & ప్రవేటు బస్సులు, ఆటోలు ఇతర వాహనాలు) మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా తప్పదని పెర్కొన్నారు.

కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీసుశాఖకు సహకరించాలని సూచించారు.

Related posts

ఆసుపత్రి నుంచే వాదనలు వినిపించిన న్యాయవాది.. సుప్రీంకోర్టులో అరుదైన ఘటన!

Drukpadam

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీకి జగన్ మద్దతు ఇస్తున్నారు: శైలజానాథ్

Drukpadam

వాషింగ్టన్ పోస్ట్ ను విక్రయించనున్న జెఫ్ బెజోస్?

Drukpadam

Leave a Comment