Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

2022లో జపాన్ దే పవర్ ఫుల్ పాస్ పోర్ట్.. ఇండియా స్థానం ఎంతంటే..!

2022లో జపాన్ దే పవర్ ఫుల్ పాస్ పోర్ట్.. ఇండియా స్థానం ఎంతంటే..!
రెండు, మూడు స్థానాల్లో సింగపూర్, దక్షిణ కొరియా
యూరోపియన్ దేశాల్లో అగ్రస్థానంలో జర్మనీ
69వ స్థానంలో చైనా ..87వ స్థానంలో ఇండియన్ పాస్ పోర్ట్
తక్కువ విలువ కలిగిన పాస్ పోర్ట్ గా ఆఫ్ఘనిస్థాన్

ఎన్ని ఎక్కువ దేశాల‌కు వీసా అవ‌స‌రం లేకుండా వెళ్ళ‌గ‌లిగితే ఆ దేశ పాస్ పోర్టు అత్యంత శ‌క్తివంతమైన‌దిగా ప‌రిగ‌ణిస్తారు. ప్ర‌తి ఏటా ప్ర‌పంచంలోని అత్యంత శ‌క్తివంత‌మైన పాస్ పోర్టుల జాబితాను విడుద‌ల చేస్తుంది హెన్లీ అండ్ పార్ట‌న‌ర్స్ సంస్థ‌. 2022 సంవ‌త్స‌రానికి సంబంధించి తాజాగా ఈ జాబితా విడుద‌ల అయింది.

2022 సంవత్సరానికి గాను జపాన్ పాస్ పోర్ట్ ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ గా నిలిచింది. ఈ పాస్పోర్ట్ కలిగినవారు ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి సమస్యలు లేకుండా వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత స్థానాల్లో సింగపూర్, దక్షిణ కొరియా దేశాలు నిలిచాయి. ఈ పాస్ పోర్టు కలిగినవారు 192 దేశాలకు ఎలాంటి సమస్యలు లేకుండా వెళ్లే అవకాశం ఉంది. మన దేశం పాస్ పోర్ట్ 87 వ స్థానంలో నిలిచింది. చైనా 69 స్థానంలో నిలవగా ఆఖరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలచింది.

ప్రముఖ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ తాజాగా విడుదల చేసిన పాస్ పోర్ట్ ఇండెక్స్ లో ఈ విషయాన్ని పేర్కొంది. ప్రపంచం కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత యూరోపియన్ దేశాల ఆధిపత్యం తగ్గిపోయినట్టు తాజా నివేదికలో తేలింది. జపాన్ పాస్ పోర్ట్ తో 193 దేశాలకు ఎలాంటి సమస్యలు లేకుండా వెళ్లిపోవచ్చు. సింగపూర్, దక్షిణకొరియా పాస్ పోర్టులతో 192 దేశాలకు ఎలాంటి సమస్య లేకుండా వెళ్లొచ్చు.

పవర్ ఫుల్ పాస్ పోర్టుల్లో యూరోపియన్ దేశాల్లో జర్మనీ అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్ గా ప్రపంచంలో నాలుగో పవర్ ఫుల్ పాస్ పోర్టుగా ఉంది. యూకే ఆరో స్థానంలో ఉంది. రష్యా 50వ స్థానంలో, చైనా 69వ స్థానంలో ఉన్నాయి. చైనా పాస్ పోర్ట్ కు 80 దేశాలతో ఈజీ యాక్సెస్ ఉంది. ఇండియా పాస్ పోర్ట్ 87వ స్థానంలో ఉంది. అన్నిటి కన్నా తక్కువ విలువ కలిగిన పాస్ పోర్ట్ గా ఆఫ్ఘనిస్థాన్ పాస్ పోర్ట్ నిలిచింది.

దీని ప్ర‌కారం సింగ‌పూర్,దక్షణ కొరియా లు రెండవ స్థానాన్ని ద‌క్కించుకున్నాయి. ఈ పాస్ పోర్టుల‌తో ఏకంగా వీసా లేకుండా 192 దేశాల‌కు వెళ్లొచ్చు. ఈ జాబితాలో ఆప్ఘ‌నిస్తాన్ చిట్ట‌చివ‌రి స్థానం ద‌క్కించుకుంది. గ‌త ఏడాదితో పోలిస్తే భార‌త్ ఏడు స్థానాలు మెరుగుప‌ర్చుకుని 87వ స్థానం ద‌క్కించుంది. భార‌త పాస్ పోర్టుతో వీసా లేకుండా 60 దేశాల‌కు వెళ్లొచ్చ‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది.

ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేష‌న్ (ఐఏటీఏ) అందించిన డేటా ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. జ‌పాన్, సింగ‌పూర్ లు ఈ జాబితాలో ఫిన్లాండ్, ఇట‌లీ, ల‌గ్జెంబ‌ర్గ్, స్పెయిన్ లు (189 దేశాల‌తో) మూడ‌వ స్థానంలో నిలిచాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెద‌ర్లాండ్స్, స్వీడ‌న్ లు (188) దేశాల‌తో నాల‌గ‌వ స్థానంలో, ఐర్లాండ్, పోర్చుగ‌ల్ లు (187 దేశాలు) ఐద‌వ స్థానంలో నిలిచాయి. అమెరికాతోపాటు యునైటెడ్ కింగ్ డ‌మ్, స్విట్జ‌ర్లాండ్, బెల్జియం, న్యూజిలాండ్, నార్వేలు (186 దేశాలు)తో ఆర‌వ స్థానంలో నిలిచాయి. అత్యంత చెత్త పాస్ పోర్టుల జాబితాలో ఉత్త‌ర కొరియా, నేపాల్, పాల‌స్తీనా, సోమాలియా, యెమెన్, పాకిస్థాన్, సిరియా, ఇరాక్, ఆప్ఘ‌నిస్తాన్ లు నిలిచాయి .

Related posts

టీడీపీ ఎమ్మెల్యేకి బ్రిటన్ పార్లమెంటు అవార్డు…

Ram Narayana

ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే త్వరలో ప్రారంభం …ఖమ్మం కలెక్టర్ గౌతమ్…

Drukpadam

దేవుడి పేరుతొ మరో వివాదం …శ్రీకృషుడి జన్మస్థలం పై కోర్ట్ లో పిటిషన్!

Drukpadam

Leave a Comment