Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రైతులకు కేంద్రం మీటర్ …రాష్ట్రం వాటర్: మంత్రి అజయ్ …

రైతులకు కేంద్రం మీటర్ పెట్టాలంటుంది ..మేం మీటర్ లేకుండా వాటర్ ఇవ్వాలంటున్నాం !మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
పాలేరు వద్ద పంట కాలువలకు నీళ్లు వదిలిన మంత్రి అజయ్
ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసింది
జలాశయాలు కళలాడుతున్నాయి….వారికీ ప్రత్యాన్మాయ పంటలవైపు ఆలోచన చేయండి
పోలవరంలోనే అంతే…రాష్ట్రప్రజలపై మోడీ కక్షకట్టారు

బాయిల కాడ ఎప్పుడు మీటర్లు పెడదామా అన్నది బీజేపీ విధానమని రైతులకు ఎప్పుడూ ఉచితంగా నీళ్లివ్వాలనేది టీఆర్‌ఎస్‌ విధానమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. వ్యవసాయంలో తెలంగాణ సగటున 10% వృద్ధిరేటు సాధించిందని, జాతీయ వృద్ధిరేటు 3%కే పరిమితం అయ్యిందన్నారు.

ఖరీఫ్ పంటల సాగుకోసం పాలేరు జలాశయం నుంచి నీటిని గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి , సండ్ర వెంకటవీరయ్య ,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు తో కలిసి నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూజలు చేశారు. అనంతరం నీటిని విడుదల చేశారు ఈ ఏడాది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని మంత్రి అజయ్ అన్నారు. పాలేరు జలాశయంకు ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో నిండుగా ఉందని పేర్కొన్నారు

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో వరి సాగును చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కొర్రీలు పెట్టడం తగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని రైతన్నలు దృష్టిలో పెట్టుకొని వరికి బదులుగా లాభసాటి, అధిక దిగుబడులు వచ్చే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని కోరారు.

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడమే కేంద్ర ప్రభుత్వం విధానమని మండిపడ్డారు. మీటర్లు పెట్టకపోతే రూ.25 వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు రావని చెప్పినా సరే.. ‘నా కంఠంలో ప్రాణముండగా మీటర్లకు ఒప్పుకోబోం’ అని కేసీఆర్‌ తెగేసి చెప్పారన్నారు. కృష్ణానది జలాల వాటా తేల్చాలని నలుగురు కేంద్ర జలవనరుల శాఖ మంత్రులను కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనాలంటే కొనకుండా కేంద్రం తొండి చేస్తుందని మండిపడ్డారు. వడ్లు కొనబోమని పీయూష్‌గోయల్‌ మొండికేస్తే, వాటిని సీఎం కేసీఆర్‌ కొన్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలం లో ఆగిన మల్లన్న సర్వదర్శనం ….

Drukpadam

బహ్రెయిన్ లో బురఖా ధరించిన మహిళకు ప్రవేశం నిరాకరించిన ఇండియన్ రెస్టారెంటు మూసివేత

Drukpadam

6 Helpful Tips For Growing Out Your Hair Without Losing Your Mind

Drukpadam

Leave a Comment