Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకోసం తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ ..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకోసం తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ ..
-40 శాతం యువతకు సీట్లు …వారిలో వారసులో ఎక్కువమంది
-70 నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్లు వారికే ఖ‌రారు చేసిన చంద్ర‌బాబు
-టికెట్స్ ఎంపికలో లోకేష్ కీలకం
-ఎంపీ ఎమ్మెల్యే టికెట్స్ ఒకేసారి ఎంపిక
-మూడు సార్లు ఓడిన అభ్యర్థులకు నో సీట్

తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నిక‌లు అత్యంత క్లిష్ట‌మైన‌వి. ఒక‌వైపు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలి. అందుకు ఆర్థిక‌బ‌లం, అంగ‌బ‌లం ఉన్న అభ్య‌ర్థులు కావాలి. మ‌రోవైపు కేంద్రం నుంచి ఎటువంటి స‌హ‌కారం అంద‌డంలేదు. ఈసారి ఎన్నిక‌ల్లో స‌హ‌క‌రించక‌పోయినా ప‌ర్వాలేదు.. త‌ట‌స్థంగా ఉంటే చాల‌ని చంద్ర‌బాబు కోరుతున్నారు. ఇంకోవైపు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న మార్గాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు. ప్ర‌సంగాల్లో పొత్తుల గురించి మాట్లాడ‌టంలేదు. జ‌న‌సేన‌ను గెలిపించాల‌ని మాత్ర‌మే ప్ర‌జ‌లను కోరుతున్నారు.

అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపించబోతున్నాయి…తెలుగు దేశం కు చావోరేవో కానున్న ఈ ఎన్నికలకోసం టీడీపీ మాస్టర్ ప్లాన్ వేస్తుంది….ప్లాన్ నెంబర్ వన్ …బీజేపీ తో పొత్తుకు ప్రయత్నించడం అదికుదరకపోతే వారితో పంచాయతీ లేకుండా చూసుకోవడం …రెండు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం …అందుకు సీఎం సీటు విషయంలో అధికారంలోకి వస్తే చేరి రెండున్నర సంవత్సరాలు అధికారాన్ని పంచుకోవడం ….ఈ రెండు వర్క్ అవుట్ అయ్యేలా చూసుకోవడం కాకపోతే ఒంటరి పోటీకి సిద్దపడటం …

ఇక టికెట్స్ విషయంలో ఎలాంటి విధానాన్ని అవలంబించాలి అనేదానిపై మంచి కసరత్తే జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం …బయటకు చెప్పకపోయినా ఆయా నియోజవర్గాల్లో కీలక నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనిచేసుకోమ్మని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. సీనియర్లను పక్కన పెట్టి యువతకు సీట్లు ఇవ్వాలనేది బాబు..లోకేష్ ల విధానం … దీనిపై కొందరు సీనియర్లు అలక బూనే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన టీడీపీ వారిని బుజ్జగించాలని నిర్ణయించింది. ఎక్కువమంది కొత్త ముఖాలను రంగంలోకి దించడం ద్వారా తేలిగ్గా గట్టు ఎక్కవచ్చునని ఎత్తులు వేస్తున్నారు .

వరుసగా మూడుసార్లు ఓటమిపాలైనవారికి సీట్లు లేవు
తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా మూడుసార్లు ఓట‌మి పాలైన‌వారికి టికెట్లు లేవ‌ని ఖ‌రాఖండిగా తేల్చేసింది. అందుక‌నుగుణంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసుకుంటూ వ‌స్తోంది. యువ‌త‌కు టికెట్లు ఇవ్వాల‌ని పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిర్ణ‌యించిన‌ట్లుగా టీడీపీ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం సీనియ‌ర్ నేత‌ల వార‌సుల‌కు కేటాయి.

Related posts

వామ్మో పెట్రోల్ @100 క్రాస్ అవుతుందా …

Drukpadam

జలదోపిడిపై కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

వనమా కోరిక మేరకు కొత్తగూడెం కు సీఎం కేసీఆర్ వరాలు!

Drukpadam

Leave a Comment