Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కమ్యూనిస్టులపై వివాదాస్పదంగా మారిన సుప్రీం మాజీ జడ్జి ఇందు మల్హోత్రా వ్యాఖ్యలు…

కమ్యూనిస్టులపై వివాదాస్పదంగా మారిన సుప్రీం మాజీ జడ్జి ఇందు మల్హోత్రా వ్యాఖ్యలు…
-ఆదాయం కోసం కమ్యూనిస్టు ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను స్వాధీనం -చేసుకుంటున్నాయి: సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా
-శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణను కేరళ ప్రభుత్వం -తీసుకోవాలనుకుందన్న జస్టిస్ ఇందు మల్హోత్రా
-జస్టిస్ యూయూ లలిత్, తనతో కూడిన ధర్మాసనం దానికి అనుమతించలేదని వ్యాఖ్య
-వైరల్ అవుతున్న జస్టిస్ ఇందు మల్హోత్రా వ్యాఖ్యల వీడియో

ఆమె ఆషామాషీ వ్యక్తికాదు …దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో జడ్జిగా పని చేశారు . ఆచితూచి మాట్లాడే ఆమె రాష్ట్రప్రభుత్వాలు దేవ్లాలయన నిర్వాణం విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కమ్యూనిస్టులు ఆదాయంకోసం హిందూ దేవాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాపితంగా చర్చనీయాంశంగా మారాయి. దేవాలయాలు స్వాధీనం చేసుకొని నడుపుతున్న కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు ఆదాయం కోసమే నడుపుతున్నాయా అ నే ప్రశ్న ఉదయిస్తుంది .

హిందూ దేవాలయాలకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయం కోసం హిందూ దేవాలయాలను కమ్యూనిస్టు ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్నాయని ఆమె అన్నారు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ అంశంపై 2020లో ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం తీసుకున్న నిర్ణయం గురించి ఆమె మాట్లాడుతూ, ఆదాయం కోసమే హిందూ దేవాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారని.. అందుకే శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణను ప్రభుత్వం తీసుకోవాలనుకోవడాన్ని తాను, జస్టిస్ యూయూ లలిత్ అనుమతించలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts

సమ్మె చేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను మెచ్చుకున్న కేటీఆర్!

Drukpadam

ఖమ్మం జిల్లా టీఎన్జీఓ నూతన కార్యవర్గం కొత్త వరవడి!

Drukpadam

తెల్లవారుజామున 3 .30 గంటలవరకు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ!

Ram Narayana

Leave a Comment