Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి!

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి!
-అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
-స్రవంతికి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
-సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి

ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన రాజకీయపార్టీలు సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి ఎమ్మెల్యే పదవికి,కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీచేస్తుండగా , కాంగ్రెస్ నుంచి పాల్వయి స్రవంతి ని కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇక అధికార టీఆర్ యస్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించగా స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు . దీంతో అధినేత కేసీఆర్ ఆలోచనలో పడ్డారు . ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు . వామపక్షాలైన సిపిఐ , సిపిఎం పార్టీలు టీఆర్ యస్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే టీఆర్ యస్ , బీజేపీ పెద్ద బహిరంగ సభలు పెట్టగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మునుగోడు నుంచి వెళ్లేలా చేయాలనీ చూస్తుంది.

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాజకీయ వేడిని రగుల్చుతోంది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలోనే మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ మునుగోడులో పోటీ చేసే తమ అభ్యర్థిని ప్రకటించింది. మునుగోడులో హస్తం పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేయనున్నారు. స్రవంతి పేరును నేడు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

కాగా, మునుగోడు టికెట్ కోసం పల్లె రవికుమార్, చలమల కృష్ణారెడ్డి కూడా పోటీపడినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి వైపు మొగ్గుచూపింది. పార్టీ సీనియర్లు కూడా స్రవంతి అభ్యర్థిత్వాన్ని బలపర్చినట్టు సమాచారం.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ, ఫలితాల వెల్లడి తేదీలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే, ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మునుగోడు కోసం హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి.

బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్టే. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. గులాబీ దళం తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

కాగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రియతమ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి గారి ఆశీస్సులు తమకు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.

Related posts

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరిపై విమర్శలు ..

Drukpadam

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై!

Drukpadam

పాద‌యాత్ర పేరుతో దండ‌యాత్ర‌కు వ‌చ్చే వారిని అడ్డుకోవాలి: వైవీ సుబ్బారెడ్డి

Drukpadam

Leave a Comment