Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కెప్టెన్ ..ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడిన పంజాబ్ మాజీ సీఎం

బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్!

  • బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న కెప్టెన్
  • పీఎల్సీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటన
  • అమరీందర్ కు స్వాగతం పలికిన కేంద్రమంత్రులు

అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఆయన నేడు తన సొంతపార్టీని బీజేపీ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు . కాంగ్రెస్ కు చెందిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ఆరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్దినెలల ముందు కాంగ్రెస్ ను వీడారు . బీజేపీ కి దగ్గరైయ్యారు . అప్పుడే ఆయన బీజేపీ లో చేరుతారనే వార్తలు వచ్చినప్పటికీ ఆయన దాన్ని ఖండించి లోక్ కాంగ్రెస్ అని సొంతపార్టీ పెట్టుకున్నారు . ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడంలో సెక్సెస్ అయినప్పటికీ బీజేపీకి పెద్దగా మేలు చేయలేక పోయారు . కాంగ్రెస్ లో నవజ్యోత్ సింగ్ సిద్దు , కెప్టెన్ మధ్య నెలకొన్న విభేదాలు అక్కడ కాంగ్రెస్ కు పెద్ద నష్టం చేకూర్చాయి కెప్టెన్ వెళ్లడంతో కాంగ్రెస్ లో అయోమయం నెలకొన్నది .

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాదు, తాను స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పార్టీని కమల దళంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరణ్ రిజిజు, పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వని శర్మ తదిరులు అమరీందర్ సింగ్ కు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.

పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించిన అమరీందర్ సింగ్… అనూహ్యరీతిలో సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానం తన పట్ల వ్యవహరించి తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమరీందర్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, గతేడాది పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పార్టీని ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు.

ఇటీవలే అమరీందర్ సింగ్ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకుని లండన్ నుంచి తిరిగొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి బీజేపీలో చేరికపై చర్చించారు.

Related posts

సాయి గణేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన బండి సంజయ్ ….

Drukpadam

టీఆర్ఎస్సా?, బీఆర్ఎస్సా?.. మునుగోడు బైపోల్‌లో గులాబీ అభ్య‌ర్థి పార్టీ పేరుపై డైల‌మా!

Drukpadam

కేబినెట్ సమావేశం తర్వాత సిద్ధూ డిమాండ్లపై సీఎం చన్నీ కీలక ప్రకటన?

Drukpadam

Leave a Comment