Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీబీఐలో పని చేసేటప్పుడు చంపేస్తామని ఎర్ర సిరాతో లేఖలు ..:మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ…

సీబీఐలో పని చేసేటప్పుడు చంపేస్తామని ఎర్ర సిరాతో లేఖలు ..:మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ…
-సమాజంలో సామాన్యుల కంటే అవినీతిపరులే నిర్భయంగా తిరుగుతున్నారు
-అవినీతిని నిర్మూలించాలంటే ములాలకు వెళ్లి చికిత్స చేయాలి
-డబ్బులు లేని ఎన్నికల విధానం రావాలి

సీబీలో తాను పని చేస్తున్నప్పుడు చంపేస్తామని తనకు ఎర్ర సిరాతో లేఖలు వచ్చేవని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ సంచలన విషయాలు వెల్లడించారు . తననే కాకుండా తన కుటంబాన్ని కూడా అంతం చేస్తామని అందులో పేర్కొన్నారని తెలిపారు . మన సమాజంలో నీతివంతులకంటే అవినీతి పరులే నిర్భయంగా తిరుగుతున్నారని అన్నారు . దేశంలో అవినీతి నిర్ములించాలంటే వాటి మూలాల్లోకి పోవాలని అన్నారు . అవినీతికి చికిత్స చేయాలనీ కూడా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు .ఎన్నికల్లో డబ్బుల ప్రభావంపై ఆయన మాట్లాడుతూ డబ్బులు లేని ఎన్నికలు రావాలని అందుకోసమా ప్రజలను మార్చాలని అన్నారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను సీబీఐలో పని చేసేటప్పుడు ఎర్ర సిరాతో రాసిన లేఖలు వచ్చేవని… తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని లేఖల్లో రాసేవారని చెప్పారు. మన సమాజంలో సామాన్యుల కంటే అవినీతిపరులే నిర్భయంగా తిరుగుతున్నారని అన్నారు. అవినీతిని నిర్మూలించాలంటే మూలాలకు వెళ్లి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

బేగంపేటలో ఈరోజు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ పైవ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని… డబ్బులు లేని ఎన్నికల విధానం రావాలని ఆకాంక్షించారు.

Related posts

అనర్హత వేటుతో పెరిగిన రాహుల్ గాంధీ గ్రాఫ్….!

Drukpadam

చంద్రబాబు దీక్ష ఒక క్షుద్ర కార్యక్రమం: మంత్రి పేర్ని నాని!

Drukpadam

పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వార్…

Drukpadam

Leave a Comment