Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాలేరు లో పెరుగుతున్న ఎమ్మెల్యే కందాల గ్రాఫ్ …!

పాలేరు లో పెరిగిన ఎమ్మెల్యే కందాల గ్రాఫ్ …!
పట్టువదలని విక్రమార్కుడిలా ప్రజల మధ్యలోనే
ప్రజలకు నేనున్నాననీ భరోసా
చనిపోయిన ప్రతి పేద కుటుంబానికి చేయూత
నమ్ముకున్నవాళ్లకు కొండంత అండ
చెప్పిన పనులు చేయడంచేసేది చెప్పటం ఆయన నైజం
అయితే కొందరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడని అపవాదు

కందాల ఉపేందర్ రెడ్డి …పాలేరు ఎమ్మెల్యే … గతంలో తగ్గుతుందన్న కందాల గ్రాఫ్ పెరిగింది. ప్రజలతో సంబంధాలు పెరిగాయి. .. 2018 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి రాజకీయ ఉద్దండుడు,సీనియర్ నేత మంత్రిగా అపార అనుభవం ఉన్న టీఆర్ యస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పై ఘనవిజయం సాధించారు .అయితే కొంతకాలానికే రాష్ట్రంలోమారుతున్నా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తాను కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ యస్ లో చేరారు . ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి చేరడంపై విమర్శలు ఉన్నాయి. పార్టీ మారారని మైనస్ తప్ప మిగతా విషయాల్లో ఆయనకు ఆయనే సాటి…తన సహాయం కోరి వచ్చినవారిని అక్కున చేర్చుకొని మనస్తత్వం కందాలది…టీఆర్ యస్ లో చేరిన కొత్తలో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. పైగా అక్కడ ఓడిపోయినతుమ్మల నియోజకవర్గంపై పట్టు కలిగి ఉన్నారు . ఇద్దరి మధ్య కార్యకర్తలు నలిగిపోయారు . పాలేరు లో టీఆర్ యస్ రెండుగా చీలిపోయింది. అందులో ఒకటి ఎమ్మెల్యే వర్గం కాగా , మరొకటి మాజీమంత్రి తుమ్మల వర్గం …ఒకరిపై ఒకరు విమర్శలు …కేసులు పెట్టించుకునేదాకా వెళ్లాయి. చాలాకాలం వరకు తుమ్మల నియోజకవర్గంలో బలమైన వర్గాన్ని మెంటైన్ చేశారు . ఒక సందర్భంలో తుమ్మల ఇండిపెండెంట్ గా పోటీచేసినా గెలుస్తారని అనుకున్నారు . కానీ రాను రాను తుమ్మల ఎందుకో బలహీనపడుతూ కందాల బలపడ్డారు . కందాలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. దానికి కారణాలు లేకపోలేదు …

ఎమ్మెల్యే కందాల తనని నమ్ముకున్నవాళ్లను కాపాడుకోవడంలో ముందుటారనే పేరుంది . అధికార పార్టీలో చేరకముందు నియోజకవర్గంలో పనులు కావడం మాట అటుంచి అధికారులెవరూ మాటవినకపోవడంతో ఆయన తనను గెలిపించిన ప్రజలకు ఏమి చేయలేకపోతున్నానని మదన పడ్డారు .పార్టీ మార్పు పై తీవ్రంగా ఆలోచన చేశారు . చివరకు ప్రజలు మేలు చేయాలంటే , అధికారులు మాట వినాలంటే అధికార పార్టీలో చేరక తప్పిందికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తుంటారు .

ఇందులో కూడా నిజం లేకపోలేదు …అధికార పార్టీలో చేరిన తరువాత నియోజకవర్గంలో అన్ని మండలాలపై పట్టు సాధించారు . ప్రజల కష్టాల్లో ,సుఖాల్లో పాలుపంచుకుంటున్నారు . రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తన స్వంత నిధులు నియోజకర్గంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు అందించి పేదల ఆపద్బాంధవుడిగా మారారు . నియోజకవర్గంలో ఎవరైనా ఇబ్బందులు ఉండి తన దగ్గరకు వచ్చే వారికీ తన సహాయం అందిస్తున్నారు .ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కూడా మా ఎమ్మెల్యే ఉన్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించగలిగారు . చేయకలిగింది చెప్పడం , చెప్పింది చేయడం ఎమ్మెల్యే కందాల నైజం …

అయితే నియోజకవర్గంలో కొందరికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఎమ్మెల్యే అండతో రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారని దానివల్ల ఎమ్మెల్యే కందాల కు చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి . దీన్ని ఎమ్మెల్యే కందాల ఎలా సెట్ చేసుకుంటారో చూడాలి మరి ..!

Related posts

రాజ‌కీయాలు చేసే ఏ గ‌వ‌ర్న‌ర్ అయినా ప‌నికిమాలిన గ‌వ‌ర్న‌రే: సీపీఐ నారాయ‌ణ‌!

Drukpadam

కేంద్ర మంత్రిపై హరీశ్ రావు ఫైర్‌…

Drukpadam

నో డౌట్ మరో పదేళ్లు కేసీఆర్ సీఎం -హరీష్ రావు

Drukpadam

Leave a Comment