రాజకీయ వార్తలు

కేసీఆర్ కు ‘బీఆర్ఎస్’ సమస్య.. ఇప్పటికే ఈసీ వద్ద బీఆర్ఎస్ అప్లికేషన్లు!

కేసీఆర్ కు ‘బీఆర్ఎస్’ సమస్య.. ఇప్పటికే ఈసీ వద్ద బీఆర్ఎస్ అప్లికేషన్లు!
-బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన కేసీఆర్
-ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో అప్లికేషన్లు
-బీఆర్ఎస్ పేరు ఓటర్లను తికమకపెట్టే అవకాశం

ఏ రాష్ట్రంలోనూ శాఖలు లేకుండానే కేసీఆర్ పెద్ద సాహసం చేశారు…జాతీయపార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన కేసీఆర్ బీఆర్ యస్ పేరుతో పార్టీని ప్రకటించింది తడువుగా తమదూతలను హుటాహుటిన హస్తినకు పంపించారు . అక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలినిసి కేసీఆర్ దూతలు టీఆర్ యస్ గా ఉన్న తమ ప్రాంతీయపార్టీని బీఆర్ యస్ పేరుతో జాతీయ పార్టీగా పెడుతున్నట్లు సమావేశంలో చేసిన తీర్మానం కాఫీని ఈ సి కి అందించారు . వారు వెళ్లిన దూతలకు కూల్ గా మీ అప్లికేషన్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు . దీంతో వారు సంతృప్తి చెందారోలేదో తెలియదు కానీ బయటకు వచ్చి కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ యస్ పార్టీ పేరుతో దరఖాస్తు చేశామని వారు దాన్ని తీసుకున్నారని వెల్లడించారు . ఒకపార్టీ పేరును మార్చుతూ మరో పేరుతో ఎన్నికల సంఘం దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు అది వారి హక్కు కూడా కానీ అదే పేరుతో దరఖాస్తులు ఉంటె అనే సమస్య ముందుకు వస్తుంది . ఇదే సమస్య ఇప్పుడు ఎన్నికల సంఘం వద్ద ఉంది.బీఆర్ యస్ పేరుతో కొన్ని దరఖాస్తులు ఉన్నాయి.అందువల్ల వాటిని పరిశీలించి నిర్ణయం చెప్పాల్సి ఉంది. అది ఎప్పటికి జరుగుతుందనేది ఇప్పుడే చెప్పటం కొంచం కష్టం …అయితే ఈలోగానే వచ్చిన మునుగోడు ఉపఎన్నికల్లో ఏ పేరుతో పెటీచేయాలనేది ప్రశ్న …మొదట టీఆర్ యస్ పేరుతోనే అనుకున్న టీఆర్ యస్ తర్వాత బీఆర్ యస్ తో పోటీచేయబోతున్నట్లు ప్రకటించింది.గుర్తు జెండా రంగు షేమ్ టు షేమ్ అని తెలిపింది. పార్టీ పేరుదగ్గరే తేడా వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయంతో ఆపేరు కేసీఆర్ కు ఉంటుందా ఉండదా ? అనేది పెద్ద సమస్యగా మారింది . ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ‘బీఆర్ఎస్’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ద్వారా దేశ రాజకీయాల్లో కీలకపాత్రను పోషించాలని ఆయన భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించే పనుల్లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పేరు సమస్యను తీసుకొచ్చేలా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో నాలుగు పార్టీల అప్లికేషన్లు ఈసీ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.

సికింద్రాబాద్ నుంచి బహుజన రాష్ట్ర సమితి ఉంది. గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీకి ఓడ గుర్తుతో ఈ పార్టీ పోటీ చేసింది. ముంబై నుంచి బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ, పూణె నుంచి భారతీయ రాష్ట్రీయ స్వదేశీ పార్టీ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి అప్లికేషన్ కూడా పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసేటప్పుడు బీఆర్ఎస్ అనే పేరు ఓటర్లను తికమకపెట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ సింబల్ కారును పోలిన గుర్తులు ఉండటం… ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే.

Related posts

చినజీయర్  దిష్టి బొమ్మలను తగులబెట్టాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపు!

Drukpadam

పాల్వంచలో స్వల్ప భూకంపం… పరుగులు తీసిన ప్రజలు!

Drukpadam

వారణాసిలో రూ. 870 కోట్ల విలువైన 22 అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన..

Drukpadam