బీజేపీవి చిల్లర రాజకీయాలు కోసమే మునుగోడు ఎన్నిక :మంత్రి పువ్వాడ ఘాటువ్యాఖ్యలు …
రాజగోపాల్ రెడ్డి స్వార్ధం కోసం ఎన్నిక …ఆయన అమ్ముడు పోయారు
మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే
మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదు
మునుగోడు ఎన్నిక రాజగోపాల్ రెడ్డి సొంత ప్రయోజనం కోసం వచ్చింది
18000 వేలకోట్ల కాంట్రాక్టులు తీసుకున్న అని రాజగోపాల్ రెడ్డినే ఒప్పుకున్నాడు
రాజగోపాల్ రెడ్డి తన ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని అమ్ముకున్నాడు
రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు
మునుగోడులో జరుగుతున్నా ఉపఎన్నిక ద్వారా గులాబీ జెండా ఎగరవేసి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని బీఆర్ యస్ కు తొలిగెలుపు ఇవ్వడం ద్వారా దేశరాజకీయాలను మలుపు తిప్పాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు నిచ్చారు. ఉపఎన్నికలు జరుగుతున్నమునుగుడులో రెండు గ్రామాలకు బాద్యులుగా ఉన్న పువ్వాడ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల గోపాల్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు బీఆర్ యస్ లో అజయ్ సమక్షంలో చేరారు .వారికీ గులాబీ కండువా కప్పి సాదరంగా మంత్రి ఆహ్వానించారు . ఈ సందర్భంగా బీజేపీ విధానాలపై పువ్వాడ నిప్పులు చెరిగారు. దేశంలో మత రాజకీయాలను ప్రోత్సహించటం ద్వారా అధికారాన్ని పొంది ప్రజలపై భారాలు వేసి పెద్దలకు కట్టబెడుతుందని ధ్వజమెత్తారు .కేసీఆర్ కి జాతీయస్థాయిలో వస్తున్న ఆదరణ చూసి కుట్రతో తెచ్చిన ఎన్నిక మునుగోడు ఎన్నికని అయినప్పటికీ మునుగోడులో మంచి మైజార్టీ తో గులాబీ జెండా ఎగరటం ఖాయమన్నారు . కేసీఆర్ బీఆర్ యస్ ప్రకటనతో బీజేపీ నేతల్లో గుబులుపుట్టిందని అందువల్లనే తెలంగాణాలో ప్రజాభీష్టం మేరకు సంక్షమే పథకాలు అందిస్తున్న సీఎంగా దేశంలోనే నంబర్ వన్ గా పేరుతెచ్చుకున్న కేసీఆర్ అంటే బీజేపీ నేతలకు కంటగింపుగా ఉందని విమర్శలు గుప్పించారు . దేశరాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికగా మునుగోడు నిలవబోతుందని పువ్వాడ అన్నారు .
బీజేపీ పార్టీకి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలు అమలు అవుతాయి,మోటార్లకు మీటర్లు వస్తాయి.గత ఎనిమిది సంవత్సరాలుగా బీజేపీ పాలనలో ఏమి అభివృద్ధి జరిగిందో చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు .జీఎస్టీ ,పెట్రోల్ ధరల పెంపు ,నిత్యావసర వస్తులాధారాలు పెంపు ,నిరుద్యోగం ,పరిశ్రమల మూత,ఉపాధి కోల్పోయి విధినపడ్డ కోట్లాదిమంది కార్మికుల గురించి ఏనాడైనా బీజేపీ పట్టించుకుందా అని పువ్వాడ ప్రశ్నించారు.
మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు ప్రయత్నం చేయలేదని విమర్శించారు. కేవలం 18 వేల కోట్ల కాంట్రాక్టులకోసమే బీజేపీకి అమ్ముడు పోయారని దుయ్యబట్టారు. బీజేపీ ఆడమన్నట్లు ఆడుతున్నారని ఇది ప్రజలకోసం వచ్చిన ఎన్నిక ఎంత మాత్రం కాదని కేవలం రాజగోపాల్ రెడ్డి స్వంతం స్వార్ధం కోసం బీజేపీ కొని తెచ్చి పెట్టుకున్న ఎన్నిక అని అందువల్ల చైతన్యవంతులైన మునుగోడు ప్రజలు బీజేపీ మత , ప్రాంతీయ రాజకీయాలను తిప్పికొట్టి కేసీఆర్ అభ్యర్థిగా రంగంలోకి వచ్చిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు . దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్న దేశం చూపు తెలంగాణ వైపు ఉన్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు .బీఆర్ యస్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నదని ఇప్పటికే కేసిఆర్ ని అవహేళన చేసిన వారంతా నేడు చీకట్లో కలిసి పోయారు పువ్వాడ అన్నారు .