Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఆర్ యస్ కు ప్రతిష్టాత్మకం …బీజేపీకి సంకటం …కాంగ్రెస్ కు ఆక్సిజెన్!

టీఆర్ యస్ కు ప్రతిష్టాత్మకం …బీజేపీకి సంకటం …కాంగ్రెస్ ఆక్సిజెన్!
-మునుగోడుపై ఎవరి లెక్కలు వారివి
-కేసీఆర్ బీఆర్ యస్ భవిష్యత్ నిర్ణయించే ఎన్నిక
-బీజేపీ తెలంగాణాలో పాగా వేయాలంటే మునుగోడే కీలకం
-కాంగ్రెస్ కు కలలకు ముందడుగు …

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక శాసనసభ ఉపఎన్నిక అనేక సందేహాలను పటాపంచలు చేసేదిగా , అనేక ప్రశ్నలకు సమాధానాలు తీర్చేదిగా మారింది. అందువల్ల దేశం చూపంతా మునుగోడుపై పడింది. ఈ ఎన్నికపై ఎవరి లెక్కలు వారికీ ఉన్నాయి. ప్రధానంగా అధికార టీఆర్ యస్ కు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ యస్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడింది. టీఆర్ యస్ స్థానంలో కేసీఆర్ బీఆర్ యస్ పెడుతున్నట్లు ప్రకటించారు . జాతీయ రాజకీయాల్లో బీఆర్ యస్ కీలకం కానున్నదని దేశంలో బీజేపీ , కాంగ్రెస్ కు ప్రత్యాన్మాయ శక్తిగా బీఆర్ యస్ కు అనేక రాష్ట్రాల నుంచి మద్దతు ఉందని గులాబీ దళం చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో మునుగోడు గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది . గెలవకపోతే కేసీఆర్ బీఆర్ యస్ కు మనుగడ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.అందువల్ల నాయన భయానా గెలవాలని కేసీఆర్ తన యంత్రాంగాన్ని అంతా మునుగోడు లో దించారు . 86 మంది ఎమ్మెల్యేలు , మంత్రులు ఎంపీలు , ఒకరేమిటి జడ్పీ చైర్మన్లు , డీసీసీబీ చైర్మన్లు , రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ల చైర్మన్లు ,ఒక్కొక్కరికి ఒక గ్రామం అప్ప చెప్పారు . ఇక నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ డబ్బు ఖర్చులో పోటీపడుతున్నాయి. మందు ,విందు , భోజనాలు , పెట్రోల్ ,వాహనాలు ,ప్రచారంలో పాల్గొంటే పూటకింత అని డబ్బులు ముట్టచెప్పటం సర్వసాధారణమైంది. వివిధ జిల్లాలలోని టీఆర్ యస్ నాయకులూ కార్యకర్తలు మునుగోడులో మకాం వేశారు . ఎమ్మెల్యే లేదా మంత్రి ఇంచార్జి గా ఉన్న గ్రామంలో మెజార్టీ రాకపోతే వచ్చే ఎన్నికల్లో మీసీటు గ్యారంటీ లేదనే సంకేతాలు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో వారి అనుయాయిలను అక్కడ మకాం వేయించారు . అక్కడ మెజార్టీ ఓట్లు తెచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు . కొన్ని గ్రామాల్లో గ్రామ ప్రజలకన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే బీజేపీ నుంచి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , రాష్ట్ర వ్యహారాలు ఇంచార్జి తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రులు , టీఆర్ యస్ నుంచి సీఎం కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు , సిపిఎం , సిపిఐ నాయకులు తమ్మినేని , కూనంనేని , కాంగ్రెస్ నుంచి రాష్ట్ర వ్యహారాలు ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ , రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లు ప్రచారంలో ఉన్నారు.

మునుగోడు పై ఎవరి లెక్కలు వారికున్నాయి. అందరు ప్రచారంలో దూసుకుపోతున్నారు . గెలుపు కోసం ఎత్తులు ,పై ఎత్తులు వేస్తున్నారు .అస్త్ర శాస్త్రాలు సంధిస్తున్నారు.అయినప్పటికీ డబ్బులు పంచి ఓట్లు కొనడంపైనే ప్రధాన జ్యాస పెట్టారు .ఓటర్లు కూడా ఎవరు ఎంత ఇస్తారు అనేది చూస్తున్నారు . అందువల్ల ఎవరు గెలుస్తారు ..అనేది చెప్పడం కొంచెం కష్టంగానే ఉందనే అభిప్రాయాలూ ఉన్నాయి.

బీజేపీ తెలంగాణాలో పాగా వేయాలంటే మునుగోడు కీలకంగా మారింది.అంతే కాకుండా బీజేపీ తరుపున పోటీచేస్తున్న అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతైనా ఖర్చు చేస్తారనే అభిప్రాయాలూ బలంగా ఉన్నాయి. అయితే ఆయనకు మైనస్ కూడా ఉంది. అసలు ఈయన కాంగ్రెస్ కు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.సరే చేసినా ఎమ్మెల్యే పదవి ఎందుకు వదులు కున్నారు . ఇది అహంకార చర్య కదా అనే దానికి సమాధానంలేదు . పైగా బీజేపీ చేతిలో పావుగా మారడం ఆయన అనుయాయులకు సైతం ఇష్టంలేదు .

టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పట్ల కూడా ప్రజల్లో అంతా సానుకూలత లేదు ..టీఆర్ యస్ నుంచి తనకు టికెట్ ఇవ్వాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సీఎం కు మోర పెట్టుకున్న ఆలకించలేదనే ప్రచారం ప్రజల్లో బాగా జరిగింది. పైగా ఓటర్లలో అధికశాతం ఉన్న బీసీలను కాదని ఉన్నత కులాలకు అందులో రెడ్లకు అన్ని పార్టీలు టిక్కెట్లు ఇవ్వడం పై చర్చజరుగుతోంది.

కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రంగంలో ఉన్నారు .గతంలో కూడా ఈమె ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి ఘణనీయమైన ఓట్లు పొందారు .
కాంగ్రెస్ పని అయిపొయింది అని ప్రచారం జరుగుతున్న తరణంలో ఈ సీటు గెల్వడంద్వారా ముందడుగు వేయాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అందువల్ల మునుగోడు ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్నది …

Related posts

గతంలో పనిచేసిన అధికారులు కేసీఆర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

Drukpadam

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూల పంపిణీ!

Drukpadam

కిడ్నాప్ అయ్యాననుకుని.. ఉబర్ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన మహిళ…

Drukpadam

Leave a Comment