Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఆర్ఎస్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన హైకోర్టు!

టీఆర్ఎస్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన హైకోర్టు!

  • మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులున్నాయని టీఆర్ఎస్ పిటిషన్
  • 8 గుర్తులను తొలగించాలని కోరుతూ పిటిషన్
  • పిటిషన్ ను రేపు విచారిస్తామన్న హైకోర్టు

మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు ఓటర్లను తికమకకు గురి చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కారు మాదిరి మరికొన్ని గుర్తులు ఉన్న నేపథ్యంలో ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురి కావచ్చని, దీనివల్ల తమ ఓట్లు ఇతరులకు పడే అవకాశం ఉందనే భావనలో ఉంది. ఈ నేపథ్యంలో, మునుగోడులో గుర్తులపై హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని పిటిషన్ లో కోరింది.

అయితే ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని… రేపు విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, కెమెరా, సబ్బు, టీవీ, మిషన్, ఓడ గుర్తులు టీఆర్ఎస్ గుర్తును పోలి ఉన్నాయని.. వీటిని తొలగించాలని తొలుత ఈసీకి టీఆర్ఎస్ లేఖ రాసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టులో ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనిపై రేపు హైకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో వేచి చూడాలి.

Related posts

ఏడాదిలోనే 5 రెట్లు పెరిగిన బీఆర్ఎస్ ఆదాయం.. తాజా ఆస్తుల విలువ రూ. 480 కోట్లకు జంప్

Drukpadam

పీవోకే పై భారత్ కలలు కల్లలే: పాక్ ఆర్మీ చీఫ్!

Drukpadam

భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

Drukpadam

Leave a Comment