Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు పవన్ భేటీ …జగన్ సర్కారుపై సమరశంఖం..

చంద్రబాబు పవన్ భేటీ …జగన్ సర్కారుపై సమరశంఖం…
ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలుద్దాం …ఎన్నికల సంగతి తర్వాత
రాష్ట్రంలో ప్రతిపక్షాలు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాయి
నా 40 ఏళ్ళ చరిత్రలో ఇంతటి దుర్మార్గమైన పాలన చూడలేదు
మాట్లాడే స్వేచ్ఛ లేకుండా హరిస్తున్నారు
చంద్రబాబు కలిసినందుకు కృతజ్ఞతలు ;పవన్ కళ్యాణ్

ఏపీ రాజకీయాలు గమ్మత్తుగా మారాయి. మొన్న విశాఖ లో జరిగిన విశాఖ గర్జన సందర్భంగా కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళుతున్న మంత్రులు జోగి రమేష్ , రోజా , టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి లపై దాడి జరిగింది.అదే రోజు విశాఖ ఎయిర్ పోర్ట్ కు పవన్ కళ్యాణ్ వస్తుండటంతో అక్కడకు చేరుకున్న జనసైనికులు మంత్రుల వాహనాలపై దాడి చేశారు .దీంతో దాడి చేసిన వారిపై సి సి కెమెరాల ఆధారంగా కేసులు నమోదు చేశారు . 150 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు.అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ ను విశాఖ వీడాలని పోలీస్ లు ఆదేశాలు జారీచేశారు . దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు.

దీనిపై వైసీపీ మండిపడింది .దాడి మా మీద జరిగితే పరామర్శలు పవన్ కళ్యాణ్ కు ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు ఏమి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు . లేనిదానిని ఉన్నట్లుగా , ఉన్నదానిని లేనట్లుగా చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన అబద్దాల ప్రచారానికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తోడు కావడం మంగళవారం జరిగిన జనసేన సమావేశంలో వైసీపీ నాయకులపై బండబూతులు తిట్టడం నా ….ల్లారా అంటూ సంబోధించడం పై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్ లోఉన్న పవన్ కళ్యాణ్ ను కలిసి గంటకు పైగా మాట్లాడటం ఆసక్తిగా మారింది.

గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాలు వాడీవేడిగా మారాయి. విశాఖలో వైసీపీ గర్జన, అదే రోజున పవన్ కల్యాణ్ ఎంట్రీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీసుల ఆంక్షలతో జనవాణి కార్యక్రమం నిర్వహించకుండానే పవన్ విశాఖ నుంచి వెనుదిరిగారు.

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విజయవాడలో పవన్ కల్యాణ్ ను కలిశారు. నగరంలోని నోవోటెల్ హోటల్ కు వచ్చిన చంద్రబాబును పవన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇరువురు సమావేశమై విశాఖలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జనసేనానికి సంఘీభావం తెలిపారు.

కాగా, ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యుడు నాగబాబు కూడా పాల్గొన్నారు.

 

చంద్రబాబు మాటలకు పగలబడి నవ్విన పవన్ కల్యాణ్… !

  • పవన్ ఇలా మాట్లాడ్డం ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు
  • కదిలిపోయానని వెల్లడి
  • ఇప్పుడు పవన్ వంతు వచ్చిందని వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇలా ఉందని వ్యంగ్యం
Pawan Kalyan laughs while Chandrababu speach
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం విజయవాడలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. ఇటీవల ఘటనల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపారు. ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతిపక్షాలను లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విపక్షంలేదు, రెండో ప్రతిపక్షమైన జనసేన లేదు… ఏ పార్టీని లెక్క చేయకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియాను కూడా పరిగణనలోకి తీసుకోవడంలేదని, కులాలు, ప్రాంతాల రంగు పులుముతున్నారని అన్నారు.

వాళ్లు చేసే తప్పులను ప్రశ్నించే పనిలో మనం ఉంటే, మనల్ని విమర్శించి పబ్బం గడుపుకునే పనిలో వాళ్లున్నారు అని వివరించారు. మానసికంగా, శారీరకంగా, నైతికంగా ఎన్నిరకాలుగా విమర్శించాలో అన్ని రకాలుగా విమర్శిస్తున్నారు. మీరూ మనుషులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నేను ఇవాళ చూశాను… పవన్ కల్యాణ్ గారికి ఎప్పుడూ ఇలా మాట్లాడడం అలవాటులేదు. సినిమాల్లో హీరోగా ఉండడం తప్ప ఇక్కడికొచ్చి తిట్టే అలవాటు లేదు. అలాంటి వ్యక్తిని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నాలాంటి వాడే కదిలిపోయాడు. నాకు చాలా ఓపికని అందరూ అంటారు. నేనే భరించలేకపోయాను. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది, రేపు ఎవరి వంతు వస్తుందో తెలియదు. ఇదీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మాటలకు పవన్ కల్యాణ్ పగలబడి నవ్వారు. దాంతో, సీరియస్ గా సాగుతున్న ప్రెస్ మీట్ లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. చంద్రబాబుతో సహా, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అందరి ముఖాల్లో నవ్వులు కనిపించాయి.

Related posts

ముగిసిన అమరావతి రైతుల మహా పాదయాత్ర!

Drukpadam

టీఆర్ యస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణకు అన్యాయం…

Drukpadam

యూపీ ఎన్నికల్లో ఒకే స్తానం నుంచి అజాం ఖాన్ భార్య ,కొడుకు నామినేషన్!

Drukpadam

Leave a Comment