Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు చేసిన బీజేపీ!

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు చేసిన బీజేపీ!

  • బీజేపీ రూ. 223 కోట్లు ఖర్చు చేసినట్టు ఏడీఆర్ నివేదిక
  • మొత్తం పార్టీల ఖర్చు రూ. 470 కోట్లు
  • రూ. 102.65 కోట్ల వ్యయంతో కాంగ్రెస్ రెండో స్థానం

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మొత్తం ఖర్చు చేసింది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల కంటే బీజేపీ అత్యధికంగా ఖర్చు పెట్టిన విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదించింది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజీపీ రూ. 223 ఖర్చు చేసింది. ఇది అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఖర్చు చేసిన మొత్తంలో దాదాపు సగం కావడం గమనార్హం. ఈ ఐదు రాష్ట్రాల్లో మిగతా అన్ని పార్టీలు కలిపి రూ. 470 కోట్లు ఖర్చు చేశాయని ఏడీఆర్ వెల్లడించింది. రూ. 102.65 కోట్ల వ్యయంతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, రూ. 68.64 కోట్ల ఖర్చుతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మూడో స్థానంలో ఉంది.

అదే సమయంలో బీజేపీకి రూ.914.03 కోట్లు నిధులు వచ్చినట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో 13 రాజకీయ పార్టీలు సేకరించిన మొత్తం నిధులు రూ. 1441.79 కోట్లు కాగా, ఖర్చు చేసిన మొత్తం రూ. 470.10 కోట్లు అని నివేదిక పేర్కొంది. రాజకీయ పార్టీలు ప్రకటించిన మొత్తం వ్యయంలో ప్రచార ఖర్చులే 33.93 శాతం ఉన్నట్టు తెలిపింది.

కాగా, ఆయా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ నేతల ప్రయాణం, అన్నిరకాల ప్రచారం కోసం పార్టీ తరఫున డబ్బు ఖర్చు చేస్తాయి. అలాగే, పోటీలో ఉన్న అభ్యర్థులకు పార్టీ తరఫున కొంత మొత్తం ఇవ్వడంతో పాటు, అభ్యర్థుల నేర పూర్వాపరాలను సొంత ఖర్చుతో ప్రచురిస్తాయి. ఈ లెక్కలను ఎన్నికల కమిషన్ కు నివేదిస్తాయి.

Related posts

వనమా రాఘవ పార్టీ నుంచి సస్పెన్షన్…తక్షణం అమల్లోకి !

Drukpadam

సాగర్ ఉపఎన్నిక – పట్ట భద్రుల ఎన్నిక కోసం పార్టీల ఎత్తులు

Drukpadam

హాస్యనటుడు అలీ ఎంపీ కానున్నారా ?

Drukpadam

Leave a Comment