Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మూగపోయింది… సీపీఐ నారాయణ…

మోడీని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మూగపోయింది… సీపీఐ నారాయణ…
-పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు
-పొత్తులపై నారాయణ కీలక వ్యాఖ్యలు
-మోదీతో భేటీ తర్వాత పవన్ మౌనంగా మారిపోయారని విమర్శ
-మోదీ, జగన్ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపణ

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీలో రాజకీయ పొత్తులపై , పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మూగపోయిందో అర్థం కావడం లేదని అన్నారు. వైసీపీ సర్కార్ ను ఇంటికి పంపాలంటే టీడీపీ, జనసేన , విపక్షాలు పొత్తులు తప్పవని అన్నారు . అనంతకు ముందు వైసీపీ వ్యతిరేక ఓట్లు చిలనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రధానితో ఏమి మాట్లాడారు . ప్రధాని ఏమి చెప్పారనేది వెల్లడించాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇష్టం ఉన్నా, లేకున్నా టీడీపీ, జనసేన, వామపక్షపార్టీలు కలిసి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. అలా ముందుకెళ్తేనే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని నారాయణ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెప్పిన పవన్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. మోదీ జగన్ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే మూడు పార్టీలు కలిసి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని నారాయణ పేర్కొన్నారు.

Related posts

రేవంత్ ,ఎంపీ కోమటిరెడ్డి జాయింట్ ప్రెస్ మీట్ …కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజం!

Drukpadam

కాంగ్రెస్‌కు 70 సీట్లు రాకుంటే రాజీనామా.. ఎంపీ కోమటిరెడ్డి ప్రకటన…

Drukpadam

సంజయ్ అరెస్ట్ అనంతర పరిణామాలపై రంగంలోకి దిగిన ప్రధాని ….

Drukpadam

Leave a Comment