Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికా ,కెనాడాలలో మంచు తుఫాన్లు … స్తంభించిన జనజీవనం !

అమెరికా ,కెనాడాలలో మంచు తుఫాన్లు … స్తంభించిన జనజీవనం !
-అమెరికాలో 5 వేల విమానాల రద్దు …
-21 మంది మృతి చెందినట్లు వార్తలు
-అమెరికాలో స్తంభించిన జనజీవనం.. క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఇళ్లకే పరిమితం
-బాంబ్ సైక్లోన్ ప్రభావంతో తీవ్ర ప్రతికూల ఉష్ణోగ్రతలు
-వార్మింగ్ సెంటర్లను తెరిచిన యంత్రాంగం
-25 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు
-కెనడాలో అనేక వాహనాల ప్రమాదం…

అమెరికా ,కెనడా దేశాల్లోని అనేక రాష్ట్రాల్లో మంచు తుఫాన్ ,ఈదురు గాలులతో జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇల్లు వదిలి బయటకు వచ్చేందుకు వణికి పోతున్నారు .అమెరికాలో ఇప్పటికే 5 వేల విమానాలు రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 21 మంది పౌరులు మరణించారని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలకు ఈ ఏడాది క్రిస్మస్ సంబరాలు దూరమయ్యాయి. తీవ్ర తుఫాను (బాంబ్ సైక్లోన్) కారణంగా ఇప్పటికి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో కోట్లాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లలో మగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. వాహనదారులు సైతం ఇబ్బందులు పడ్డారు .కొన్ని చోట్ల వాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

సహాయక, పునరుద్ధరణ చర్యలకు ప్రతికూల వాతావరణం అవరోధంగా మారింది. ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో, మైనస్ 37డిగ్రీలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. న్యూయార్క్, టెనెస్సే, వాషింగ్టన్ డీసీల్లో మైనస్ 9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. తీవ్ర ప్రతికూల వాతావరణంలో ప్రజలు పర్యటనలు, వేడుకలు రద్ధు చేసుకుని, ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా శీతాకాలంలో బలమైన తుఫాను రాక అక్కడి జనజీవనాన్ని స్తంభింపజేసింది.

విమాన సర్వీసులను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన తుఫానుగా దీన్ని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 24 కోట్ల మందికి వాతావరణంపై హెచ్చరికలు జారీ అయ్యాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నెలకొనడంతో పోలీసు స్టేషన్లు, లైబ్రరీల్లో వార్మింగ్ సెంటర్లను తెరిచారు.

Related posts

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ పై సీబీఐకి విచారణ…ఏపీ హైకోర్టు …!

Drukpadam

Why Consumer Reports Is Wrong About Microsoft’s Surface Products

Drukpadam

ఈడీ దాడుల త‌ర్వాత‌…చైనా పారిపోయిన వివో డైరెక్ట‌ర్లు!

Drukpadam

Leave a Comment