Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పవన్ నిలకడలేని స్టేట్మెంట్లు …జనసేనలో కన్ఫ్యూజన్!

పవన్ నిలకడలేని స్టేట్మెంట్లు …జనసేనలో కన్ఫ్యూజన్!
-బీజేపీతో కలిసే ఉన్నాం.. బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నమన్న పవన్
-ఎవరు కలిసొస్తే వారితో కలిసి ముందుకెళ్తామన్న పవన్
-కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తామని వ్యాఖ్య
-ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా వెళ్తామన్న జనసేనాని
-తెలంగాణ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర

జనసేనానాని పవన్ కళ్యాణ్ నిలకడలేని స్టేమెంట్లు జనసేనలను కూడా కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి. ఒక సందర్బాల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చిలనివ్వబోము అంటారు . మరో సందర్భంలో బీజేపీతోకలిసే ఉన్నామని అంటారు .టీడీపీతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతారు .తామంటే వైసీపీకి భయమంటాడు .సింగిల్ గా పోటీచేస్తే అధికారం ఇస్తామంటే అందుకు సిద్దమనే అంటారు .ఆ హామీ ప్రజలు ఇవ్వాలని కోరతారు . తెలంగాణ రాజకీయాల్లో కూడా జనసేన కీలక పాత్ర పోషిస్తుందని అంటాడు…చివరకు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఎవరి తో పొత్తులు పెట్టుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.

జనసేన ప్రస్తుతానికి బీజేపీతో కలిసే ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎవరు కలిసొస్తారో వారితో కలిసి ముందుకెళతామని అన్నారు. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా ముందుకెళ్తామని తెలిపారు. ఎవరు కలిసొచ్చినా, కలిసి రాకపోయినా ముందుకెళ్తామని చెప్పారు. ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా ముందుకెళ్తామని అన్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని… వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే పొత్తుల గురించి మాట్లాడొచ్చని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు.

విపక్షాలను అణచివేయడానికే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని విమర్శించారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలనేదే తన కోరిక అని పవన్ చెప్పారు. ఓట్లను చీలనివ్వబోమని అన్నారు. రోజురోజుకు వైసీపీకి నమ్మకం సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు. అందుకే తన పర్యటనకు, నారా లోకేశ్ పాదయాత్రకు ఆటంకాలను కలిగించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. 175 సీట్లలో గెలుస్తామని చెప్పుకునే వైసీపీకి అంత భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా జనసేన కీలక పాత్రను పోషిస్తుందని చెప్పారు.

ఒక చిన్న ఉద్యోగానికే ఎన్నో టెస్టులు పెడతారని, నాయకత్వం వహించాలంటే ఇంకెన్ని పరీక్షలు ఎదుర్కోవాలి? కాలం పెట్టే పరీక్షలు ఎదుర్కోవడానికి నేను రెడీ అని పేర్కొన్నారు. చాలా విషయాల్లో తాను తగ్గి మాట్లాడుతున్నానని… భయపడి మాత్రం కాదని పవన్ వెల్లడించారు. తెలంగాణలో పరిమితులతో కూడిన ఆట ఆడుతున్నానని అన్నారు. 

ఏపీతో పోల్చితే తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని, ఏపీ తరహా నాయకత్వం తెలంగాణలో ఉండుంటే ఇంత అభివృద్ధి చెందేది కాదని అభిప్రాయపడ్డారు. బాబాయ్ ని చంపేవాళ్లు, న్యాయవ్యవస్థలను తిట్టేవాళ్లు, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేవాళ్లు ఏపీలో ఉన్నారని పవన్ కల్యాణ్ పరోక్ష విమర్శలు చేశారు. ఏపీలో కులాల గీతల మధ్యన రాజకీయం చేయాల్సి ఉంటుందని, తనలాంటి వాడికి అది చాలా కష్టమైన పని అని వివరించారు.

కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహికి పూజలు..

ట్రాఫిక్ సమస్య వల్ల పవన్ పర్యటన ఆలస్యం అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు.

ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జనసేనాని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపించారు.

పవన్ కళ్యాణ్ తో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు దగ్గరుండి చేయించిన వేద పండితులు వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించారు. వారాహి వాహనానికి పండితులు ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టి వారాహిని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం జనసేనాని ప్రారంభసూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించారు.

వారాహి ప్రారంభించిన అనంతరం నాచుపల్లి సమీపంలోని కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కానున్నారు.

Related posts

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌!

Drukpadam

రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రద్దు …

Drukpadam

కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీ గూటికి టీమిండియా మాజీ క్రికెటర్

Drukpadam

Leave a Comment