Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరిగి బీఆర్ యస్ గూటికి చేరిన బొమ్మెర రామ్మూర్తి!

తిరిగి బీఆర్ యస్ గూటికి చేరిన బొమ్మెర రామ్మూర్తి!
మధిర నుంచి తానే పోటీ చేస్తాను అంటున్న బొమ్మెర రామ్మూర్తి
నిన్నమొన్నటివరకు పొంగులేటి వెంట తిరిగిన బొమ్మెర
-2014 లో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన బొమ్మెర
ఉద్యమకారుడిగా గుర్తింపుసీఎం కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అందరితో నేరుగా పరిచయాలు
మధిర సీటుపై ఆశతో తిరిగి బీఆర్ యస్ లోకి

బొమ్మెర రామ్మూర్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చేసిన ఉద్యమంలో పాల్గొన్న నేత….రాష్ట్రమంతా తిరిగి ఉద్యమాన్ని ఉర్రుతలు ఉగిస్తున్న తరణంలో ఎక్కువగా హరీష్ రావు తోపాటు చాలాకాలం కలిసి తిరిగిన నేత …కేసీఆర్ ,కేటీఆర్ ,కవిత తో సహా అందరితో పరిచయాలు ఉన్న బొమ్మెర కు మధిర నుంచి పోటీచేయాలనే కోరికఉంది. 2014 ఎన్నికల్లో పోటీచేసినా ఓడిపోయారు . 2018 పార్టీ టికెట్ ఇవ్వలేదు . ఈసారి ఎలాగైనా పోటీచేయాలనే తలంపుతో పొంగులేటి గూటికి చేరారు . అయితే ఆయన పార్టీకి దూరమైనా నేపథ్యంలో పార్టీతోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్న బొమ్మెర తిరిగి రాష్ట్ర నేతలను కల్సి తన అభిప్రాయాన్ని తెలిపారు . అందుకు వారు సమ్మతించడంతో తిరిగి పార్టీలో యాక్టీవ్ గా తిరగాలని నిర్ణయించుకున్నారు .

ఇందులో నిజమెంత ఉందోగాని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయుడిగా ఉన్న బొమ్మెర రామ్మూర్తి కి మంత్రులు, సీఎం కేసీఆర్ నుండి స్పష్టమైన హామీతోనే యూటర్న్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది.

మధిర బిఆర్ఎస్ అభ్యర్థి బొమ్మెర రామ్మూర్తి ద్వారానే మధిర గడ్డపై బీఆర్ యస్ జెండా ఎగురుతుందని బొమ్మెర విలేకరుల సమావేశంలో తెలియజేశారు బీజేపీ వంటి జాతీయ పార్టీ నుంచి పిలుపు వచ్చిన కూడా బీఆర్ యస్ పార్టీలోనే ప్రాణం పోయేవరకు కొనసాగుతానని స్పష్టం చేశారు .

మధిర నియోజకవర్గానికి కావలసిన నిధులేవీ రాలేదు కారణం స్థానికంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వలనే రాష్ట్రం నుండి రావాల్సిన నిధులు పుష్కలంగా రాలేదని విమర్శించారు .

తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది మధిర నియోజకవర్గం లో కూడా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే మధిర నియోజకవర్గం అభివృద్ధి మరింతగా జరుగుతుంది ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు .

మధిరలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికి ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయాలనీ కోరారు . దీనికోసం రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రులతో మాట్లాడి మంజూరు అయ్యేలాగా కృషి చేస్తానని చెప్పారు …

Related posts

మాకు కేసీఆర్ ఉన్నారు… ఆయనే మా ధైర్యం: మల్లారెడ్డి!

Drukpadam

సచిన్ బీజేపీలోచేరుతున్నారంటూ ప్రచారం … కొట్టి పారేసిన కాంగ్రెస్ నేత సచిన్…

Drukpadam

దోపిడీ పీడన ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది..సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…

Drukpadam

Leave a Comment