క్రైమ్ వార్తలు

మధ్యప్రదేశ్ లో యూనివర్సిటీపై బాంబు దాడి.. !

మధ్యప్రదేశ్ లో యూనివర్సిటీపై బాంబు దాడి.. !

  • ముసుగు ధరించి వచ్చి రెండు బాంబులు విసిరిన దుండగుడు
  • జబల్ పూర్ లో రాణి దుర్గావతి వర్సిటీలో ఘటన
  • అదే ప్రాంతంలో పేలని రెండు బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్ పై బాంబు దాడి జరిగింది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి రెండు నాటు బాంబులు విసిరాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వరుసగా రెండు బాంబులు విసిరాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. అక్కడున్న వాళ్లు అతడిని పట్టుకునేందుకు పరిగెత్తగా.. దుండగుడు బైక్ పై పరారయ్యాడు. క్యాంటీన్ బయట ఈ దాడి జరిగిందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ ప్రాంతంలో పేలని రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ‘‘యూనివర్సిటీలోని క్యాంటీన్ బయట గుర్తుతెలియని వ్యక్తి బాంబులు విసిరినట్లు మాకు సమాచారం వచ్చింది. ఎవరికీ ఏమీ కాలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేశ్ కౌరవ్ చెప్పారు.

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఇద్దరు తెలుగు టీనేజర్ల మృతి!

Drukpadam

మద్యం తాగించి.. ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం…

Ram Narayana

2 వేల సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి సీరియల్ కిల్లర్ ను పట్టుకున్న పోలీసుల

Ram Narayana