Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్…

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్…
ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి
కూంబింగ్ కు వెళ్లి వస్తుండగా ఘటన

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ లో ముగ్గురు పోలీసులు మరణించారు . ఎన్ కౌంటర్ చనిపోయిన ముగ్గురు డీఆర్జీ జవాన్లు ఉన్నారు . మావోయిస్టుల కదలికకాల సమాచారంతో కూంబింగ్ కు వెళ్లిన పోలీసులకు ,మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పోలిసుల వైపు నష్టం జరగ్గా మావో ల వైపు నుంచి ఎలాంటి నష్టం జరిగిందనే సమాచారం లేదు . ఆప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భిక్కుభిక్కు మంటూ ఉన్నారు .

సుకుమా జిల్లా జేగురుగొండ,కుందేడ్ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్.
మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో డీఆర్జి జవాన్లు ముగ్గురు మృతి చెందడంపట్ల పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కూంబింగ్ కు వెళ్లి తిరుగు ప్రయాణంలో చోటు చేసుకున్న ఘటన ఒక్క సరిగా దిగ్బ్రాంతికి గురిచేసింది .
మృతులు ఏ ఎస్ ఐ రామ్ సింగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా మరియు వంజం బీమా గా గుర్తించారు . ఈ విషయాన్నీ
సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ ధ్రువీకరించారు .రాయపూర్ నుంచి పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దళాలు ఆప్రాంతానికి చేరుకున్నాయి. ఇటీవల కాలంలో మావోల ప్రాభల్యం తగ్గిందని ప్రచారం జరుగుతున్న వేళ ఈసంఘటన చోటు చేసుకోవడంపై యంత్రాంగం అప్రమత్తమైంది …

Related posts

పులివెందులలో జగన్ …స్పీకర్ బాధ్యతల స్వీకారానికి డుమ్మా…

Ram Narayana

పదకొండేళ్ల చిన్నారికి ప్రేమ లేఖలు రాసిన టీచర్.. అమెరికాలో ఘటన

Ram Narayana

బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి

Drukpadam

Leave a Comment