ఢిల్లీలో తెలంగాణా నేతలతో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా ,నడ్డా భేటీ!
-తెలంగాణాలో పార్టీ పరిస్థితులపై ఆరా …
-ఇప్పుడు ఉన్నట్లుగా ఉంటె అధికారం రావడం కష్టం
-మీరు మారాలి …పార్టీలోకి వచ్చే వాళ్ళను గుర్తించి ప్రోత్సహించాలి
-హాజరైన ముఖ్యనేతలు …బండి ,కిషన్ రెడ్డి , ఈటెల ,తరుణ్ ఛుగ్
-అధికారం కోసం చేయాల్సిన పనులపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం
-ఐక్యతతో ముందుకు సాగాలని నేతలకు ఉద్బోధ
-మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో పోటీచేస్తామని బండి సంజయ్ వెల్లడి …
తెలంగాణ లో రాజకీయపరిస్థితులపై రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా సమావేశమైయ్యారు . రాష్ట్రలో పార్టీ పరిస్థితులపై దాదాపు మూడుగంటలపాటు చర్చించారు . రాష్ట్రలో పార్టీ పరిస్థితి తమదగ్గర ఉన్న సర్వే నివేదికలు రాష్ట్రనేతలకు వివరించారు . పార్టీ గతంలోకన్నా పెరిగిన అధికారంలోకి వచ్చేట్లుగా పెరగలేదని అందువల్ల మరింత కష్టపడాలని రాష్ట్రనేతలకు ఉద్బోధించారు . దీనికోసం నాయకుల మధ్య ఐక్యత పెరగాలని అదే విధంగా పార్టీలో చేరేవారిని బలమైన నేతలను గుర్తించి వారిని పార్టీలో చేరేలా ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు . మనం అధికారంలోకి రావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి వారిని మనవైపు తిప్పుకోవాలి మీరు చేస్తున్న కృషి బాగానే ఉందని అభినందిస్తూనే ఇది చాలదని కాస్త గట్టిగానే చెప్పారు . ఏ ఒక్కరివల్లనే కాకుండా అందరి సమిష్టి కృషి ఇందుకు అవసరం అని అభిప్రాయపడ్డట్లు సమాచారం … మార్చ్ లో అమిత్ షా పర్యటన ఉన్నందున నాటికీ వివిధ పార్టీల్లోఉన్న అసంతృప్తులను గుర్తించి పార్టీలో చేరేలా కార్యాచరణ రూపొందించాలని కోరారు .
ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో జరిగిన సమావేశంలో అమిత్ షా కూడా పాల్గొన్నారు .రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , ఈటెల రాజేందర్ , ఎంపీ మోహన్ రావు ,మాజీ ఎంపీలు , ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు . తర్వాత బండి సంజయ్ మీడియా తో మాట్లాడారు . తెలంగాణాలో మొత్తం 119 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీచేస్తుందని చెప్పారు. అందుకు తమ పార్టీ సన్నద్ధం అవుతుందని అన్నారు .