Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తనకు 69 ఏళ్లు వచ్చాయి.. ముసలోడిని అవుతున్నా: కేసీఆర్

తనకు 69 ఏళ్లు వచ్చాయి.. ముసలోడిని అవుతున్నా: కేసీఆర్
బాన్సువాడ అభివృద్ధికి పోచారం ఎంతో కృషి చేశారన్న కేసీఆర్
ఆయన ఇంకెంతో కృషి చేయాలని ఆకాంక్షించిన సీఎం
ఉమ్మడి ఏపీలో ప్రజలు, రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని వ్యాఖ్య

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు .ఈసందర్భంగా తనకు 69 సంవత్సరాలు వచ్చాయి…మూడులోడిని అవుతున్నానని అనడంపై ఆయన మాటలు విన్నవారు ముసలోడు అంటే ఎన్నిసంవత్సరాలు అనేసందేహాలు వచ్చారు .సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు 58 సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల క్రితం ఆ వయసును మరో మూడు సంవత్సరాలు పెంచుతూ 61 సంవత్సరాలు చేశారు . దీంతో 61 సంవత్సరాలు నిండినవారు ఏ పనిచేయలేరని అర్థం …మరి రాజకీయ నాయకులకు అది వర్తించదా ..? అంటున్నారు …తనకు 69 సంవత్సరాలు వచ్చాయని తాను ముసలోడిని అవుతున్నానని కేసీ ఆర్ అనడంపై ముసలి అంటే ఎంత వయసు అనే చర్చకు దారితీసింది . కేసీఆర్ వయసు రీత్యా ముసలోడేకాని ఆలోచనలు మాత్రం కుర్రోడులాగానే ఉంటాయని అంటున్నారు మరికొందరు …

ఈ సందర్భంగా జరిగిన సభలో బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో కష్టపడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఇంకెంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. పోచారం వయసు పెరుగుతోందని… అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. తనకు కూడా 69 ఏళ్లు వచ్చాయని… ముసలోడిని అవుతున్నానని చెప్పారు. బాన్సువాడకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.

కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడకు వచ్చినప్పుడు ఆలయ పరిస్థితి బాగోలేదని… ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అప్పట్లోనే అనుకున్నామని చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కొందరు మిత్రులతో వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తనను కోరారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు, రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని… తెలంగాణ ఉద్యమానికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు.

Related posts

బద్వేల్ బీజేపీ అభ్యర్థి సురేష్ ….

Drukpadam

చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అనను: కమలాపురం సభలో సీఎం జగన్!

Drukpadam

రౌడీ సేన కాదు.. మాది విప్లవ సేన: పవన్ కల్యాణ్!

Drukpadam

Leave a Comment