Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పాక్ లో జంట పేలుళ్లు.. 13 మంది దుర్మరణం…

పాక్ లో జంట పేలుళ్లు.. 13 మంది దుర్మరణం…

  • స్వాత్ లోయను వణికించిన పేలుళ్లు
  • కౌంటర్ టెర్రరిజం ఆయుధగారంపై దాడి
  • పేలుళ్ల ధాటికి మరో 50 మందికి గాయాలు

పాకిస్థాన్ లో సోమవారం జంట పేలుళ్లు సంభవించాయి. వాయవ్య పాకిస్థాన్ లోని స్వాత్ లోయలో ఈ పేలుళ్లు జరిగాయి. కౌంటర్ టెర్రరిజం ఆయుధగారంపై జరిగిన ఈ దాడిలో 13 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో కౌంటర్ టెర్రరిజం అధికారులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. పేలుళ్లు జరిగిన సమయంలో ఆఫీసు పక్క నుంచి నడుచుకుంటూ వెళుతున్న తల్లీ కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని షహబాజ్ అహ్మద్ ట్విట్టర్ లో స్పందించారు.

తొలుత ఈ ఘటనను ఆత్మాహుతి దాడిగా పేర్కొన్న ప్రధాని.. ఘటనపై విచారణ జరిపిస్తామని, టెర్రరిజంపై పోరులో పాక్ పోలీసులు ముందుంటారని చెప్పారు. సోమవారం రాత్రి మరోమారు ట్వీట్ చేస్తూ.. ఈ పేలుళ్లకు కారణాన్ని గుర్తించేందుకు అధికారులు విచారణ చేస్తున్నారని ప్రధాని తెలిపారు.

కాగా, స్వాత్ లోయతో పాటు చుట్టుపక్కల ప్రాంతమంతా గతంలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల అధీనంలో ఉండేది. 2009లో మిలటరీ ఆపరేషన్ నిర్వహించి పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది. ఆ తర్వాత ఇక్కడ కౌంటర్ టెర్రరిజం ఆఫీసును, ఆయుధగారాన్ని ఏర్పాటు చేసింది. పోలీసులు, కౌంటర్ టెర్రరిజం ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం జరిగిన జంటపేలుళ్లు ఈ కౌంటర్ టెర్రరిజం ఆయుధగారాన్ని లక్ష్యంగా చేసుకున్నవేనని పోలీసులు తెలిపారు.

Related posts

చిన్నారిని దత్తత పేరుతొ వ్యభిచారంలోకి దించిన మహిళ

Drukpadam

 నకిలీ రెంటల్ రసీదుతో పన్ను మినహాయింపు పొందుతున్నారా? జాగ్రత్త!

Ram Narayana

దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు…

Drukpadam

Leave a Comment