Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడంపై ఈటల కుండబద్దలు…

పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడంపై ఈటల కుండబద్దలు…
-వారు బీజేపీలో చేరడం కష్టమేనన్న ఈటల
-వారు నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల వెల్లడి
-బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి, జూపల్లి
-కాంగ్రెస్సా …బీజేపీనా తేల్చుకోలేక పోతున్న నేతలు
-వారిని బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ఈటల ముమ్మర ప్రయత్నాలు

మాజీఎంపీ పొంగులేటి ,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరిక విషయంపై ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు బీజేపీలో చేరడం కష్టమేనని కుండబద్దలు కొట్టారు .పైగా వారు తనకే కౌన్సిలింగ్ ఇస్తున్నారని సంచలన విషయాలు వెల్లడించారు .అయితే వారి సమస్యలు వారికున్నాయని వారిపట్ల కొంత సానుభూతి చూపించారు . రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు , పార్టీల బలాబలాలు , వచ్చే ఎన్నికల్లో బీఆర్ యస్ ను ఓడించ గలిగే శక్తి ఉన్న పార్టీ పై వారు ఈటెలను ప్రశ్నించినట్లు తెలిసింది. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న చర్యలు లిక్కర్ స్కాం లో జరుగుతున్న పరిణామాలు గురించి కూడా వారి చర్చల్లో చోటు చేసుకున్నట్లు సమాచారం . దీంతో ఈటల వారు బీజేపీ లో చేరడంపై ఆశలు వదులుకున్నట్లుగా మాట్లాడటం గమనార్హం … వారి మాటలను బట్టి ఈటెల ఇక బీజేపీలో చేరారని నిర్దారణకు వహ్సినట్లు ఉన్నారు.దీంతో ఆయన వారితో జరిగిన చర్చల వివరాలను రేఖా మాత్రంగా పంచుకున్నారు .

బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుల పయనం ఎటు అన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్న విషయం తెలిసిందే … బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నిత్యం పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతూ, వారిని బీజేపీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అంతకు ముందు అనేక సార్లు వారితో సంప్రదింపులు జరిపిన ఈటెల నేరుగా ఖమ్మం పొంగులేటి నివాసానికి వచ్చి చర్చలు జరిపారు . తర్వాత కూడా గతవారం హైద్రాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో సుదీర్ఘ మంతనాలు జరిపారు .అయితే, ఈటల ప్రయత్నాలు ఏమంత ఫలప్రదం అవుతున్న సూచనలు లేవని ఈటల వ్యాఖ్యలే చెబుతున్నాయి.

తాను ప్రతిరోజు పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతున్నానని, కానీ వారు బీజేపీలో చేరడం కష్టమేనని అన్నారు. పైగా వారు తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు వారిని కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని ఈటల తెలిపారు. బీజేపీలో చేరడానికి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని తెలిపారు.

Related posts

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట…జగన్ సంచలన నిర్ణయాలు!

Drukpadam

ప్రధాని మోడీపై సంచలన కామెంట్స్ చేసిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్!

Drukpadam

చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో అనేక మలుపులు …

Drukpadam

Leave a Comment