Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

హోంగార్డుపై ఐరన్ రాడ్ తో దాడిచేసిన మహిళా ఐఏఎస్…!

హోంగార్డుపై ఐరన్ రాడ్ తో దాడిచేసిన మహిళా ఐఏఎస్…!

  • సరన్ జిల్లాలో డీడీసీగా పనిచేస్తున్న ప్రియాంక రాణి
  • ప్రియాంక రాణి నివాసంలో గేటు వద్ద అశోక్ కుమార్ అనే హోంగార్డుకు డ్యూటీ
  • రోడ్డుపై డ్యూటీ చేయాలని ఆదేశించిన ప్రియాంక రాణి
  • నిరాకరించిన హోంగార్డు… విచక్షణరహితంగా కొట్టిన ప్రియాంక  

బీహార్ లో ఓ మహిళా ఐఏఎస్ అధికారి కొట్టిన దెబ్బలకు హోంగార్డు ఆసుపత్రి పాలయ్యాడు. బీహార్ లోని సరన్ జిల్లాలో ప్రియాంక రాణి అనే మహిళా ఐఏఎస్ ఆఫీసర్ డిప్యూటీ డెవలప్ మెంట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ఇంటి ఇద్ద భద్రత విధులు నిర్వహించేందుకు హోంగార్డు అశోక్ కుమార్ సాహ్ అనే హోంగార్డును నియమించారు.

ప్రియాంక రాణి ఇంటి గేటు వద్ద సెంట్రీ బాధ్యతలను అతడికి కేటాయించారు. అయితే, గేటు వద్ద కాకుండా రోడ్డుపై విధులు నిర్వర్తించాలని అశోక్ కుమార్ ను ప్రియాంక రాణి ఆదేశించారు. అందుకు ఆ హోంగార్డు నిరాకరించడంతో మహిళా ఐఏఎస్ అధికారిణికి కోపం తారస్థాయికి చేరింది. దాంతో అక్కడే ఉన్న ఓ ఇనుప రాడ్ తీసుకుని ఆ హోంగార్డును విచక్షణ రహితంగా కొట్టారు.

గాయాలపాలైన అతడిని అక్కడున్న వారు చప్రా సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అశోక్ కుమార్ సాహ్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై హోంగార్డ్స్ వలంటీర్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారిణి ప్రియాంక రాణిపై చర్యలు తీసుకోకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించింది.

Related posts

రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ…!

Drukpadam

దేశంలోనే అత్యంత పొడవైన ‘అటల్ సేతు’ సముద్ర వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

Ram Narayana

దేశంలో విప్లవాత్మక మార్పులు రావాలి …నాగలి పట్టే చేతులే శాసనాలు చేయాలి … నాందేడ్ లో  కేసీఆర్ !

Drukpadam

Leave a Comment