Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో కామెడీ పండించిన కేఏ పాల్ ….

ఖమ్మంలో కామెడీ పండించిన కేఏ పాల్ ….
తన మిత్రుడు అమిత్ షా ప్రధాని కావాలని ఆకాంక్ష
మోడీ పరిపాలనలో వైఫల్యం చెందారని విమర్శ
పొంగులేటి ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపు
డిప్యూటీ సీఎం ను చేస్తానని హామీ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 సీట్లు గెలిపిస్తానన్న పాల్

కేఏ పాల్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు …మొత్తం ప్రపంచ దేశాధినేతలంతా తన దీవెనలకోసం క్యూకడతారని ,అమెరికా ,బ్రిటన్ , ఆస్ట్రేలియా , కెనడా , స్విజర్లాండ్, నెదర్లాండ్ ,ఒకటేమిటి అన్ని దేశాలతో తనకు సంబంధాలు ఉన్నాయని చెపుతున్నటారు . ఒకప్పుడు ఉన్నమాట నిజమని కూడా అంటారు .కానీ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హాస్యం పండిస్తున్న నేతగా గణతికెక్కారు . గతంలో ఏపీలో తానే అధికారంలోకి వస్తానని పోటీచేసి తిరిగారు . ఇప్పడు తెలంగాణ పై ఫోకస్ పెట్టారు .కొద్దీ నెలల క్రితం మునుగోడు లో జరిగిన ఎన్నికల్లో పండించిన కామెడీ అక్కడ ప్రజలను ,ప్రచారానికి వెళ్లినవారిని కడుపుబ్బా నవ్వించింది. తనదే గెలుపు అన్నంతగా పరుగులు తీశారు . తనకు పోలీసులు సహకరించడంలేదని వారిపై నిందలు వేశారు . తిరిగి తెలంగాణ లో ఎన్నిలకు రానున్న నేపథ్యంలో ఖమ్మం వచ్చిన మరోసారి కామెడీ పండించారు .

అమిత్ షా ప్రధాని కావాలి

పరిపాలన లో మోడీ వైఫల్యం చెందారని ,అందువల్ల తన మిత్రుడు అమిత్ షా ప్రధాని కావాలని అన్నారు .అందుకే మోడీ రాజీనామా చేయాలని తాను కోరుతున్నట్లు చెప్పారు .

పొంగులేటికి డిప్యూటీ సీఎం

పొంగులేటి జన బలం ఉంది….ఆయన బీజేపీలోకి లేదా కాంగ్రెస్ లోకి వెళ్లాలని చూస్తున్నారు…వాటివల్ల ఉపయోగంలేదు . కాంగ్రెస్ లోకి వెళ్ళితే రేవంత్ రెడ్డి తన కులం వాడు కాబట్టి వెళ్లాడని అంటారు .అందువల్ల ఆయన్ను తన ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 కి 10 సీట్లు గెలిపిస్తా మనమే అధికారంలోకి వచ్చేది …నేడు సీఎం ఆయనను పార్టీలో నెంబర్ టు స్థానం ఇస్తా…డిప్యూటీ సీఎం ను చేస్తానని అన్నారు .ఆయన్ను కలవలేదు కానీ అనేక సార్లు ఫోన్ లో మాట్లాడానని తెలిపారు .జిల్లా అభివృద్ధికి 10 వేల కోట్లు ఇస్తా …పెన్షన్లు డబుల్ చేస్తా …అని మీడియా ముందు నవ్వులు పూయించారు కేఏ పాల్….

ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ ఒక పెద్ద డ్రామా అని అభివర్ణించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు కనీసం 50 సార్లు అపాయింట్ మెంట్ అడిగి ఉంటారని, కానీ తన మిత్రుడు అమిత్ షా ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని పాల్ తెలిపారు. మరి ఇప్పుడెందుకు అపాయింట్  మెంట్ ఇచ్చినట్టు అని ప్రశ్నించారు. చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి ముప్పు తప్పించుకోవాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

Related posts

కాంగ్రెస్ లో చల్లారని హుజురాబాద్ కాక…మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచల కామెంట్స్!

Drukpadam

ఆత్మరక్షణలో ఎం ఐ ఎం …బీజేపీతో లాలూచి లేదని వెల్లడి!

Drukpadam

అభ్యర్థుల జాబితాను రెడీ చేసిన పంజాబ్ కాంగ్రెస్.. రెండు స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ!

Drukpadam

Leave a Comment