Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ నిర్బంధ పాలన కొనసాగిస్తున్నారు … పి వై ఎల్ సభలో వక్తలు…

అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ నిర్బంధ పాలన కొనసాగిస్తున్నారు … పి వై ఎల్ సభలో వక్తలు…
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగిన సాదినేని , నరసింహారెడ్డి
-పార్లమెంట్ కు రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని ధ్వజం
-ప్రశ్నిస్తే కేసులు పెట్టి ,జైళ్లకు పంపడమా…సిగ్గు సిగ్గు
-మానవ హక్కులు హరించబడుతున్నాయని ఆవేదన
-నియంతపాలన సాగుతుందని నిప్పులు

ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) రాష్ట్ర 2వ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తుడుం రామయ్య, నలగాటి వెంకన్న ప్రాంగణo భక్త రామదాసు కాలక్షేత్రం లో పి వై ఎల్ రాష్ట్ర అద్యక్షులు కె . వరదయ్య అధ్యక్షతన బహిరంగ సభ జరుగుగా టి పి టి ఎఫ్ మాజీ అధ్యక్షులు నర్సింహరెడ్డి గ, సి పి ఐ ఎం ఎల్ న్యూడెమోక్రసి కేంద్ర కమిటి నాయకులు సాధినేని వెంకటేశ్వరావులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యoగం చాల సంక్లిష్టమయిందనీ,నిర్భంద, నిరంకుశ విధానాలు కేంద్ర,రాష్ట్ర పాలకులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే,విమర్శిస్తే నేరoగా భావించి కేసులో పెట్టడం జైళ్లకు పంపడం పై వారు మండిపడ్డారు. బ్రిటిష్ వలస పాలన పోవాలని ఆకాంక్షించారు.కాని నేడు బ్రిటిష్ పాలన సాగుతుందనీ వారు తీవ్రంగా విమర్శించారు. 2014 -2023 పోల్చుకుంటే హక్కులు లేవు, స్త్రీ పురుష వివక్షత, ఆదివాసీలను వెళ్ళగొట్టి పన్నాగం హింస కొనసాగుతుంది. బీజేపీ , ఆర్ ఎస్ ఎస్ , భజరంగదళ్ లు దబోల్కర్, గౌరి లంకేషలను హత్య చేశారన్నారు. భీమాకోరేగావ్ కుట్రకేసు బనాయించి ప్రజాస్వామిక వాదులను హక్కుల ఉద్యమకారులను బాంబే జైలు తీవ్రంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.పార్లమెంట్, రాజ్యాంగానికి విలువలు లేకుండా హిందుత్వ లక్ష్యాలను నెరవేర్చు కుంటున్నాయనీ, బి జె పి , బి. ఆర్ ఎస్ పాలనలో సమాజం వెనుకకు వెళ్ళింది. నిరుద్యోగం, నిత్యావసర వస్తువులధరలు ఆకాశన్నంటాయనీ ధ్వజమెత్తారు . వ్యవసాయం కార్పోరేట్ శక్తులకు అమ్మేశారని విమర్శించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే.గోవర్ధన్, ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌని ఐలయ్య, ఐ ఎఫ్ టి యూ రాష్ట్ర కార్వదరి శ్రీనివాస్, బాబురావు , ఏ పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి . వేరు, పి వై ఎల్ రాష్ట్ర కార్యదర్శి రాజేందర్, చిట్టిబాబు. నాయకులు తుడుం వీరభద్రం,మోకాళ్ళు రమేష్ కుమారి, నలగాట్టి వీరేందర్, యం. గిరి, కె సురేష్,తిమ్మిడి హనుమంతరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు అద్యక్ష,కార్యదర్శులు వేణు,నిర్మల పాటలు,కళారూపాలు చేశారు.

Related posts

బీజేపీ ,జనసేన కలిసే పోటీచేస్తాయి..బీజేపీ ఎంపీ సుజనా చౌదరి …

Drukpadam

శరద్ పవార్‌కు బెదిరింపులు.. అమిత్ షాకు సుప్రియా సూలే విజ్ఞప్తి!

Drukpadam

ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్ర‌జ‌లు సాధించిన విజయం: ఈట‌ల రాజేంద‌ర్

Drukpadam

Leave a Comment