Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భార్య నాటు తుపాకీతో కాల్చిన భర్త
పరిస్థితి విషమం

భార్యను చంపటానికి ఉపయోగించిన నాటు తుపాకీ


కట్టుకున్న భార్య భర్త నాటు తుపాకీతో కాల్చిన సంఘటన
జూలూరుపాడు మండలపరిధిలోని భోజ్యాతండా పంచాయతీ పుల్లుడు తండాలో గురువారం రాత్రి జరిగింది. తండాకు చెందిన లావుడియా శంకర్ (అలియాస్) సామ కుటుంబ సమస్యలతో క్షణికావేశానికి గురైతన భార్య శాంతిని ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో కాల్చాడు. వీపు భాగంలో కాల్చగా వెన్నుపూస దెబ్బతినడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆమెను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రికీ తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వ

  • సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్స్పీ

నాటుతుపాకీతో భార్యను కాల్చిన విషయం తెలుసుకున్న కొత్తగూడెం డిస్పీ అబ్దుల్ రెహమాన్ హుటాహుటిన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించిబాధితురాలు భర్త శంకర్ తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని నాటు తుపాకీని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా నాటు తుపాకీ వచ్చినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.?అర్ధరాత్రి పోకలగుండెం గ్రామస్తుడు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనే నాటు తుపాకీని తయారు చేశాడా, లేక మరెవరైనా నాటు తుపాకీ తయారు చేస్తున్నారా,? ఇంకా పాపకొల్లు చుట్టు పక్కల గ్రామాల్లో ఎంత మంది దగ్గర నాటు తుపాకీలు ఉన్నయి అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు..

  • అడవి జంతుల వేటపై విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు..
    ఫుల్లు తండా గ్రామంలో నాటు తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తి నిత్యం అడవి జంతువుల వేట కోసం అడవులకు వేటకు వెళ్లే వాడని గ్రామస్తులు తెలపడంతో అప్రమత్తమైన ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు ఇంకా ఎంతమంది దగ్గర నాటు తుపాకులు ఉన్నాయి ఎవరెవరు అడవుల్లో వేటకు వెళ్తున్నారు అనే కోణంలో ఫారెస్ట్ సిబ్బంది విచారణ ముమ్మరం చేశారు.

Related posts

టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

Drukpadam

కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి గైర్హాజరు.. రాజీనామా చేసినట్టు ఢిల్లీలో ప్రచారం

Drukpadam

చంద్రబాబు నివాసం అటాచ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరిన సీఐడీ!

Drukpadam

Leave a Comment