Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్​ సంచలన నిర్ణయం.. ప్రొఫెసర్​ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తివేత!

సీఎం కేసీఆర్​ సంచలన నిర్ణయం.. ప్రొఫెసర్​ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తివేత!

  • హరగోపాల్ సహా 152 మందిపై కేసు
  • గతేడాది ఆగస్టులో తాడ్వాయి పోలీస్‌ స్టేషన్ లో ఎఫ్ఐఆర్
  • కేసు ఎత్తివేయాలని డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ పై నమోదైన రాజద్రోహం కేసును ఎత్తివేయాలని నిర్ణయించారు. హరగోపాల్ తో పాటు మరికొందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదైన కేసులను ఉపసంహరించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. హరగోపాల్ తోపాటు మొత్తం 152 మందిపై ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ లో గతేడాది ఆగస్టులో 19న ఈ కేసు నమోదైంది. ఉపాతో పాటు, ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి.

హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం తెలంగాణలో సంచలనం సృష్టించింది. కేవలం మాయిస్టుల డైరీల్లో పేరు ఉందని హరగోపాల్, ఇతరులపై ఉపా కేసు నమోదు చేయడాన్ని ప్రజా సంఘాల నేతలు, విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా హరగోపాల్ పాటు 152 మందిపై కేసులు పెట్టడం దారుణమని దుర్మార్గమని పౌరసమాజం ముక్తకంఠంతో ఖండించింది … దీనిపై ఆందోళనలకు సైతం వివిధ పార్టీలు పౌరసమాజం , ప్రజాసంఘాలు సిద్దమైన వేళ కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించాలని నిర్ణయించింది.
విచిత్రమేమంటే ఈకేసులో ముంబై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సురేష్ (రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి )పేరు ఉండడం కూడా సంచలనంగా మారింది. వీరితో పాటు ప్రొఫెసర్ పద్మ షా , చిక్కుడు ప్రభాకర్ ,సంధ్య, విమలక్కపై కేసులు ఉన్నాయని అంటున్నారు . అందరు పౌరహక్కుల కోసం ప్రజల సమస్యలపై వారి వారి స్థాయిల్లో స్పందించేవారు …అందువల్ల దీనిపై వస్తున్న విమర్శలకు తలొగ్గిన కేసీఆర్ ప్రభుత్వం వారిపై కేసుల్ని ఎత్తివేసేందుకు దిగిరాక తప్పలేదు . ఇది నిజంగా పౌరసమాజ విజయం … ప్రజల పార్టీల వత్తిడి ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. తక్షణమే హరగోపాల్, మరికొందరిపై నమోదైన ఈ కేసును ఉపసంహరించాలని డీజీపీని ఆదేశించారు.

Related posts

గర్వంగా చెబుతా.. ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధాని హైదరాబాద్‌: కేటీఆర్​

Ram Narayana

చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా: కేటీఆర్

Ram Narayana

తమ్మినేని ఆరోగ్యంపై ఆందోళన అవసరంలేదు …హైద్రాబాద్ ఏ ఐ జిలో చికిత్స

Ram Narayana

Leave a Comment