- అమెరికాలో టెక్సాస్ రాష్ట్రానికి చెందిన మెల్బా మెబానే అరుదైన ఫీట్
- సూపర్ మార్కెట్‌లో లిఫ్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన మహిళ
- ఆ తరువాత సౌందర్య ఉత్పత్తుల విభాగంలో కుదురుకున్న వైనం
- దశాబ్దాల పాటు ఏకధాటిగా ఉద్యోగం చేస్తూ నిబద్ధత చాటుకున్న మహిళ
సెలవులు పెట్టేందుకు సాకులు వెతికే ఉద్యోగులు కోకొల్లలుగా ఉన్న ప్రపంచంలో ఓ వ్యక్తి 74 ఏళ్ల పాటు లీవ్ పెట్టకుండా జాబ్ చేశారంటే నమ్మడం కష్టమే! కానీ ఓ అమెరికా మహిళ సరిగ్గా ఇదే చేశారు. దశాబ్దాల పాటు ఏకధాటిగా పనిచేసిన ఆమె ఇటీవలే 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకున్నారు.
మెల్బా మెబానే అనే మహిళ 1949లో టెక్సాస్‌లో మేయర్ అండ్ ష్మిడ్ స్టోర్‌లో లిఫ్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అప్పటికి ఆమెకు జస్ట్ 16 ఏళ్లు. నాటి నుంచీ ఆమె ఉద్యోగానికే అంకితమైపోయారు. 1956లో ఆ సంస్థను డిలార్డ్ అనే మరో సంస్థ సొంతం చేసుకుంది. కాగా, లిఫ్ట్ ఆపరేటర్‌గా తన ప్రయాణం మొదలెట్టిన ఆమె ఆ తరువాత దుస్తులు, కాస్మెటిక్స్ విభాగంలో ఏకంగా 74 ఏళ్ల పాటు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఉద్యోగానికి వెళ్లారు. ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సహోద్యోగులకు ఆమెకు భారీ ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. ఇకపై తనకిష్టమైన ప్రదేశాలు చూసేందుకే ప్రాధాన్యం ఇస్తానని మెల్బా తెలిపారు.