Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

వరదల్లో ప్రజల ఇబ్బందులు పట్టించుకోని ప్రభుత్వం …సీఎల్పీ నేత భట్టి ధ్వజం …

పాలన మర్చి పోయిన కేసీఆర్ ..అందుకే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటూ విమర్శలు.
వరద ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
అధికార యంత్రాగం బీఆర్ యస్ నేతల కోసం కాకుండా ప్రజలకోసం పనిచేయాలి …
ఖమ్మం నగరంలో పుంపు ప్రాంతాన్ని పరిశీలించిన సిఎల్పీ నేత భట్టి
ప్రజలకు అండగం ఉంటామని హామీ …

భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటె ప్రభుత్వం స్పందిస్తున్న తీరు జుగుస్సాకరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు .
వాతావరణ శాఖ అధికారులు పదేపదే భారీ వర్షాలపై సూచనలు చేసినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు . . శుక్రవారం ఆయన ఖమ్మంలోని మున్నేరు వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటె ప్రజలకు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావని అన్నారు . సీఎం కేసీఆర్ ప్రజల బాధలను గాలికి వదిలేశారని విమర్శించారు . ప్రభుత్వ వైఫల్యం వల్లనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్నమని మండి పడ్డారు . పరిపాలనకు సంబంధించిన అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.
ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు వద్దనున్న వెంగలరావు కాలనీలోని ప్రజలు పడుతున్న భాధ నేను కళ్లారా చూసాను. ఇప్పటివరకు అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేయలేదు. కనీసం ముంపు భాదితులను కలసి వారికీ భరోసా కూడా కల్పించకపోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ..

అధికార యంత్రాంగాన్ని ప్రజల కోసం పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హితవు పలికారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరిగిన విధ్వంసం ముంపునకు గురవుతున్న ప్రజలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో, ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరోసారి ఘోరంగా విఫలమైంది. అధికార యంత్రాంగాన్ని బీఆర్ఎస్ పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పని చేసేలా చూడాలని భట్టి విక్రమార్క హితవు పలికారు

రాష్ట్ర వ్యాప్తంగా ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లో అధికారులు పర్యటించి నష్టాన్ని అంచనా వేయడంతో వాటు.. వారికి పరిహారాన్ని అందించాలని అన్నారు. రాష్ట్ర సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు వారితో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ..

Related posts

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలి: హైకోర్టు కీలక ఆదేశాలు…

Drukpadam

గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

Ram Narayana

నల్గొండ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానం….

Ram Narayana

Leave a Comment