Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

గద్దర్ స్మారకంగా ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేయాలి: సీపీఐ నారాయణ

గద్దర్ స్మారకంగా ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేయాలి: సీపీఐ నారాయణ
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
గద్దర్ తో సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న సీపీఐ నారాయణ
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సూచన

జన వాగ్గేయకారుడు గద్దర్ మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. గద్దర్ తో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తామిద్దరం తెలంగాణ అంతటా తిరగామని నారాయణ వెల్లడించారు.

ఆయన తొలుత విప్లవకార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఆ తర్వాత విభేదాలు రావడంతో జనంలోకి వచ్చారని వివరించారు. తదనంతర కాలంలో వామపక్ష ప్రజాస్వామ్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.

“పొడుస్తున్న పొద్దు మీద నడస్తున్న కాలమా… పోరు తెలంగాణమా” అంటూ ఆయన గీతం రాష్ట్రమంతా మార్మోగిపోయిందని, గద్దర్ తెలంగాణ ఉద్యమానికి తలమానికంలా నిలిచాడని నారాయణ కొనియాడారు. అటువంటి వ్యక్తి మరణించడం బాధాకరమని, ఆయన కుటుంబానికి సీపీఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని వెల్లడించారు.

ఆయన అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సూచించారు. గద్దర్ స్మారకంగా ఏదైనా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

సాంస్కృతిక విప్లవసారధి …చైతన్య రగిలించిన ద్యమకారుడు ..ఐజేయూ అధ్యక్షులు కె . శ్రీనివాస్ రెడ్డి

సాంస్కృతిక విప్లవసారథి, ఉద్యమాలకు ఉపిరిలూదిన స్ఫూర్తిదాత , తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా ఉర్రుతలు ముగించిన గద్దర్ ఇక లేరన్న వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందని ఐజేయూ అధ్యక్షులు కె . శ్రీనివాస్ రెడ్డి అన్నారు …ఇది ఒక్క తెలంగాణకే కాదు .యావత్ దేశానికి ఆయన చూపిన మార్గం కొత్తవరవడిని చూపించింది. పేదల పక్షపాతి , పీడన ఎక్కడుంటే అక్కడ ప్రత్యేక్షమైన గద్దర్ ఒక ప్రజా యుద్ధనౌక .. ఆయన మరణం పూడ్చలేనిది …వారి మృతికి జోహార్లు , కుటుంబసభ్యులకు కోట్లాది మంది ఆయన అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను …

గద్దరన్న ఇక లేరన్న వార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది: చిరంజీవి
గద్దరన్నకు లాల్ సలాం అంటూ స్పందించిన చిరంజీవి
ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని వ్యాఖ్యలు
గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ట్వీట్

ప్రజా ఉద్యమకారుడు గద్దర్ మరణం పట్ల అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. వారి గళం అజరామరం, ఏ పాట పాడినా దానికో ప్రయోజనం ఉండేలా గొంతెత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దరన్నకు లాల్ సలాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తి రగిలించారని కొనియాడారు. అలాంటి గద్దరన్న ఇక లేరన్న వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసిందని పేర్కొన్నారు.

ప్రజాసాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ భర్తీ చేయలేనిదని, పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని చిరంజీవి వివరించారు. గద్దరన్న కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

పాటలతో ప్రజా ఉద్యమాలు నడిపిన విప్లవకారుడు గద్దర్: బాలకృష్ణ
గద్దర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాలకృష్ణ
గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రజా ఉద్యమ పాటలంటే గద్దరే గుర్తుకు వస్తారన్న బాలకృష్ణ


జన ఉద్యమకారుడు గద్దర్ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. పాటలతో ప్రజా ఉద్యమాలు నడిపిన విప్లవకారుడు గద్దర్ అని అభివర్ణించారు. ప్రజా ఉద్యమ పాటలంటే గద్దరే గుర్తుకు వస్తారని తెలిపారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నానని బాలకృష్ణ వెల్లడించారు.

గద్దర్ మృతి విచారకరం: అచ్చెన్నాయుడు

ప్రజాగాయకుడు గద్దర్ మృతి పట్ల టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం గద్దర్ కృషి చేశారని కొనియాడారు. గద్దర్ మృతితో ప్రశ్నించే స్వరం మూగబోయిందని పేర్కొన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

గద్దర్ మృతి పట్ల సంతాపం తెలిసిన మంత్రి పువ్వాడ.

ప్రజా గాయకులు, రచయిత, జన నాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు గుమ్మడి విఠల్ @ గద్దర్(77) మృతి చాలా బాధాకరం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

గద్దర్ మృతి అణగారిన వర్గాల ప్రజలకు తీరని లోటని, గద్దర్ ప్రసంగాలు, పాటలు ప్రజలలో స్ఫూర్తి నింపాయని అన్నారు.

గద్దర్ మరణం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని ఆయన అన్నారు.

గద్దర్ మృతి పట్ల ఎంపీ వద్దిరాజు దిగ్భ్రాంతి

ప్రముఖ కవి,ప్రజా గాయకులు గద్దర్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.గద్దర్ గా పేరొందిన విఠల్ కవిగా,గాయకుడిగా ఆట,పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని ,ప్రజలలో చైతన్యం పాదుగొల్పారని ఎంపీ రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.గద్దర్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని,ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,అభిమానులకు ఎంపీ రవిచంద్ర తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు .

ఆయన పాటలే తూటాలై వర్గ కసిని రగిలించాయి
గద్దర్‌ మరణం ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటు

  • సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, ఆగస్ట్‌ 6, 2023 (ఆదివారం) :- ప్రజా గాయకుడు, విప్లవ కళాకారుడు గద్దర్‌ మరణం విప్లవ, ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఆయనకు సిపిఎం జిల్లా కమిటి పక్షాన విప్లవ జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పేదలు, కార్మిక, కర్షక శ్రామిక జనావళిపై భూస్వాములు, పెత్తందార్లు, దోపిడీ పాలక వర్గాలు సాగిస్తున్న దోపిడిని, అణచివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన వ్రాసిన పాటలు తుపాకి తూటాలై ప్రజల్లో వర్గ కసిని రగిలించాయి. కార్మికుల వేతనాలు, పేదలకు భూమి, కూలి, పోడు పోరాటాలకు, వర్గ ఉద్యమాలకు ఆయన సృష్టించిన సాహిత్యం మందుగుండై పేలిందన్నారు. ఖమ్మం జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ సిపిఎం సార్థ్యంలో సాగిన ప్రజా సామాజిక సంఘాల వేదిక (టి-మాస్‌) లో భాగస్వామి అయిన గద్దర్‌ పాటలు, మాటలతో వర్గ సామాజిక చైతన్యాన్ని కలిగించారని గుర్తు చేశారు.

Related posts

ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో!: పవన్ కల్యాణ్ కు ప్రకాశ్ రాజ్ చురక

Ram Narayana

డిప్యూటీ సీఎంకు రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు…

Ram Narayana

‘బాబుతో నేను’ నిరసన దీక్షకు తెలంగాణ మంత్రి తలసాని సంఘీభావం

Ram Narayana

Leave a Comment