- గీతం వర్సిటీ యాజమాన్యంపై రోజా ఆరోపణలు
- ఖండించిన టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
- వైసీపీ అధినాయకత్వపై విమర్శలు
- రూ.40 కోట్ల ప్రజాధనాన్ని సీఎం జగన్ సొంత ఇంటి కోసం వాడుకున్నాడని ఆరోపణ
విశాఖలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన గీతం యూనివర్సిటీ 40 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు మంత్రి రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ధనాన్ని సొంతానికి వాడుకోవడం వైసీపీ నాయకత్వానికి స్వాభావికంగా వచ్చిన దోపిడీ అలవాటని ఎత్తిపొడిచారు.
ఇడుపులపాయలో దళితుల అసైన్డ్ భూములు ఆక్రమించుకుని ఎస్టేట్ నిర్మించుకుంది ఎవరు? రూ.40 కోట్ల ప్రజాధనాన్ని జగన్ రెడ్డి తన సొంత ఇంటికి ఏ విధంగా వాడుకున్నాడో మేం ఆధారాలతో వస్తాం…డిబేట్ కు వచ్చే ధైర్యం వైసీపీ ఉందా? అని సవాల్ విసిరారు.
గుడ్డ కాల్చి ఎదుటివారిపై వేయడం వైసీపీ నేతలకు అలవాటేనని, ఇవాళ రోజా కూడా అదే రీతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలనుకుంటే మీ బండారమే బయటపడుతుందని పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు. ఈ మేరకు జీవో నెంబర్లు, కేటాయింపులతో సహా ఆధారాలను వెల్లడించారు.
1. ఆర్.టి.132 25.06.19 ఆర్&బి… తాడేపల్లిలోని తన ఇంటికి రోడ్ల విస్తరణ కోసం రూ. 5 కోట్లు
2. ఆర్.టి.నం.133 26.06.19 ఆర్&బి… తాడేపల్లిలోని నివాసం కోసం హెలిప్యాడ్, ఫెన్సింగ్, బారికేడ్లు, మరుగుదోడ్లు, సెక్యూరిటీ గార్డుల కోసం రూ.1.89 కోట్లు
3. ఆర్.టి.నం.146 12.07.19 ఆర్&బి… తాడేపల్లి నివాసం కోసం ఎలక్ట్రికల్, మెకానికల్ వర్క్స్ కోసం రూ. 3.63 లక్షలు
4. ఆర్.టి.నం.160 22.07.19 ఆర్&బి… హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద సీసీ కెమెరాలు, బ్యాగేజీ స్కానర్ల కోసం రూ. 24.50 లక్షలు
5. ఆర్.టి.నం.139 09.07.19 ఆర్&బి… తాడేపల్లిలోని జగన్ నివాసానికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ. 8.50 లక్షలు
6. ఆర్.టి.నం.254 04.10.19 ఆర్&బి… తాడేపల్లిలోని జగన్ నివాసానికి పీవీసీ రైన్ ఫ్రూఫ్ పగోడాస్ , మొబైల్ టాయిలెట్స్, కూలర్ల కోసం రూ. 22.50 లక్షలు
7. ఆర్.టి.నం.259 15.10.19 ఆర్&బి… తాడేపల్లి నివాసానికి అల్యూమినియం విండోలు, డోర్ల కోసం రూ. 73.00 లక్షలు
8. ఆర్.టి.నం.306 25.11.19 ఆర్&బి… హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ఇంటి ఎలక్ట్రికల్, మెకానికల్ పనుల కోసం రూ. 35.50 లక్షలు
9. ఆర్.టి.నం.307 25.11.19 ఆర్&బి… తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం సంవత్సరపు ఖర్చుల కోసం రూ. 1.20 కోట్లు
10. ఆర్.టి.నం.308 25.11.19 ఆర్&బి… తాడేపల్లిలోని జగన్ నివాసం ఫర్నిచర్ కోసం రూ. 39.00 లక్షలు
11. ఆర్.టి.నం.366 23.12.19 టూరిజం… ఇడుపులపాయ సమాధిని టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి రూ. 27.07 కోట్లు
12. ఆర్.టి.నం.279 31.10.19 ఆర్&బి… తాడేపల్లి సి.ఎం క్యాంపు కార్యాలయానికి దక్షిణం వైపు 0.148 ఎకరాల భూ కొనుగోలు కోసం. రూ. 3.25 కోట్లు