Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన సోనియా….

తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన సోనియా….
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాం
హైదరాబాదులో కాంగ్రెస్ విజయభేరి సభ
హాజరైన సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన హామీల ప్రకటన

హైదరాబాదులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు హాజరైన పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని సోనియా తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.

ఇక, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. కౌలు రైతుల సహా ప్రతి పట్టా భూమి రైతుకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని వివరించారు. వరి ధాన్యం క్వింటాల్ పై అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ సభకు కేసీఆర్ ఆటంకాలు కల్పించిన తమకు పెరేడ్ గ్రౌండ్ ,గచ్చిబౌలి స్టేడియం ఇవ్వకుండా నిరోధించి తుక్కుగూడలో ప్రభుత్వ భూమిలో సభకు అనుమతి నిరాకరించిన రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారి పట్టాభూములను ఇచ్చారని చెప్పారు .

Related posts

కేసీఆర్ చెపితేనే తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చానన్న మైనంపల్లి…!

Ram Narayana

ఖమ్మం బీఆర్ యస్ లో ప్రకంపనలు …ఆటమొదలైందన్న పొంగులేటి ,తుమ్మల…!

Ram Narayana

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికారులకు ఈటల వార్నింగ్!

Ram Narayana

Leave a Comment