ప్రజల్లో కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ యస్ బెంబేలు …భట్టి
రాష్ట్రంలో 74 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా
ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో తుమ్మల , పొంగులేటితో కలసి సమావేశంలో పాల్గొన్న భట్టి
కాంగ్రెస్ నేతలను చూసి బీ ఆర్ ఎస్ ఆగమాగం అవుతుంద ఎద్దేవా
కాంగ్రెస్ లో చేరినందుకు గర్వంగా ఉంది: మాజీ మంత్రి తుమ్మల
గ్రూప్ వన్ పరీక్ష రద్దు ప్రభుత్వానికి చెంపపెట్టు: పొంగులేటి
ఖమ్మం కాంగ్రెస్ లో నయా జోష్ కనిపించింది …ఒకే వేదికపై భట్టి ,తుమ్మల ,పొంగులేటి ఉండటం విశ్లేషకులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి… ఖమ్మం కాంగ్రెస్ కు తిరులేదనే అభిప్రాయాలే వ్యక్తం అయ్యాయి… హార్ట్ ఫుల్ గా నాయకులు అంతా కలిసి పనిచేస్తే తిరిగి ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోటనని అంటున్నారు రాజకీయ పండితులు ..
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ యస్ బెంబేలు ఎత్తుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు . సోమవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఉందని తుమ్మల ,పొంగులేటి చేరిక మరింత శక్తిగా మారిందని అన్నారు .బి ఆర్ ఎస్ ను చూసి కాంగ్రెస్ ఆగం అవుతుందని సీఎం కేసీఆర్ అంటున్నారని కాంగ్రెస్ నేతలు, కొత్తగా పార్టీలో చేరేవారిని చూసి బిఆర్ఎస్ ఆగమవుతుందని బీఆర్ యస్ కు చురకలు అంటించారు . తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడు దిక్కు తోచక నాలుగు దిక్కుల తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మద్యం, డబ్బు , అధికారం ఉపయోగించి బిఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో 74 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోష్యం చెప్పారు. ఇంటి ఇంటికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అందజేస్తున్నామని తమ ప్రభుత్వం రాగానే ఆ కార్డు భద్ర పరచుకొని రెండు నెలల తర్వాత వాటిని తీసుకొని వస్తే గ్యారెంటీ స్కీం లు వారికి అందజేస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అమ్మకం చేసిన భూమలన్ని చట్టపరమైన చర్యలతో వెనక్కు తీసుకుంటామన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు కాంగ్రెస్ శ్రేణులు భయపడవద్దని బలమైన నాయకత్వం ఉoదని అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కాంగ్రెస్ లో చేరినందుకు గర్వంగా ..మాజీమంత్రి తుమ్మల
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతో నిబద్దతగా పని చేశానని అదే ఒరవడిని కొనసాగిస్తూ కాంగ్రెస్ లోని జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకుల సూచనలు సలహాల మేరకు అందరం కలిసి సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు . కాంగ్రెస్ లో చేరినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తుమ్మల తెలిపారు. ఎవరైనా పార్టీలో చేరితే వద్దంటారని తనకు మాత్రం కాంగ్రెస్ లోని కింద నుంచి పై స్థాయి నేతలు వరకు ఆహ్వానించారని తెలియజేశారు.
జర్నలిస్టులను సైతం మోసం చేసిన కేసీఆర్ సర్కార్ …పొంగులేటి
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల గ్రూప్ వన్ పరీక్షను కోర్టు రద్దు చేయడం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో యువత, నిరుద్యోగులను అనేక రకాలుగా కల్వకుంట్ల కుటుంబం మోసం చేసిందని మండిపడ్డారు. బఠానీలు అమ్ముకున్నట్లు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారని దుయ్యపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు లక్ష రూపాయలు సహాయం చేయాలని డిమాండ్ చేశారు. మరో 60 రోజులు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని ఈ లోగా నోటిఫికేషన్, ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏడాదిలోపే రెండు లక్షల ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. చివరకు జర్నలిస్టుల సైతం ఇళ్ల స్థలాల పేరుతో కెసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందని ఇక దేశంలో, రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షుడు జావిద్, పాలేరు పార్టీ ఇంచార్జి రాయల నాగేశ్వరరావు తదితర పాల్గొన్నారు.
తుమ్మలకు ఖమ్మం లో గ్రాండ్ వెల్ కం …
కాంగ్రెస్ లో చేరిన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తొలిసారి ఖమ్మం వచ్చిన సందర్భంగా గ్రాండ్ వెల్ కం లభించింది …ఆయన అభిమానులు , కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు .శ్రీసిటీ లోని తుమ్మల నివాసంలో ఆయన మంది కలిసి ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు . శ్రీసిటీ నుంచి కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనం వరకు 8 కి ,మీ పైగా భారీ ర్యాలీ నిర్వహించారు . తుమ్మలతోపాటు సీఎల్పీ నేత భట్టి ,కాంగ్రెస్ ప్రచార కమిటీ కో- చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీని అనుసరించారు .. ఒకరకంగా చెప్పాలంటే భట్టి ,తుమ్మల ,పొంగులేటిలు ఒకే వేదికపై కనిపించడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నయా జోష్ కనిపించింది…బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరుడి గా పోల్చారు కొందరు కాంగ్రెస్ నేతలు .ఈ జోష్ ఇలానే కొనసాగితే ఖమ్మంలో కాంగ్రెస్ కు తిరుగుండదని పరిశీలకుల అభిప్రాయం,… చూద్దాం ఏమిజరుగుతుందో …!