Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కరిచిపారేస్తున్న కమాండర్!

వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కరిచిపారేస్తున్న కమాండర్!
బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వైట్‌హౌస్ సిబ్బంది
ఇప్పటికే 11 మందికి కుక్కకాటు
తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన మరికొందరు
నిజానికీ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందంటున్న వైట్‌హౌస్ వర్గాలు
బాధితుల్లో ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్ స్టాఫ్‌, వైట్‌హౌస్ సిబ్బంది

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తొలి మహిళ డాక్టర్ జిల్ బైడెన్ రెండేళ్ల శునకం కమాండర్ జర్మన్ షెపర్డ్ వైట్‌హౌస్‌లో కనిపించిని వారినల్లా కరిచిపడేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. గతంలోనూ ఇలాంటివి జరిగినా ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఘటనలు జరిగినట్టు వైట్‌హౌస్ సీక్రెట్ సెర్వీస్ వర్గాల సమాచారం. ఇలాంటివి మొత్తం 11 ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. బాధితుల్లో ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్ స్టాఫ్‌తోపాటు వైట్‌హౌస్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరిలో కొందికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు.

ఈ ఘటనపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆంథోనీ గుగ్లీల్మి మాట్లాడుతూ.. కుక్క కాటుకు సంబంధించిన అధికారిక లెక్కలపై అస్పష్టత ఉందన్నారు. ఎవరూ కచ్చితమైన లెక్కలు చెప్పడం లేదని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనల గురించి నివేదించాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అది ఫెడరల్ అధికార పరిధిలో ఉందని తెలిపారు. కాగా, 2021లోనూ వైట్‌హౌస్‌లో ఓ ఇంజినీరు, నేషనల్ పార్క్ సర్వీస్ ఉద్యోగి కూడా కుక్కకాటుకు గురయ్యారు. తాజా ఘటనల నేపథ్యంలో వైట్‌హౌస్ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Related posts

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నాక బైడెన్ తొలి ప్రసంగం!

Ram Narayana

హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన జర్మన్ యువతి బతికే ఉంది!

Ram Narayana

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు… భారత్ పై ప్రభావం ఉంటుందన్న ఆర్థికవేత్తలు

Ram Narayana

Leave a Comment