Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మెదక్‌లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే పాదయాత్ర… రేపు, ఎల్లుండి కర్ణాటక నేతల ప్రచారం

  • రేపు, ఎల్లుండి తెలంగాణలో ఖర్గే, డీకే శివకుమార్ ప్రచారం
  • ఎల్లుండి సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్‌లలో మల్లికార్జున ఖర్గే ప్రచారం
  • కార్నర్ మీటింగ్, పాదయాత్ర నిర్వహించనున్న మల్లికార్జున ఖర్గే
  • రేపు డీకే శివకుమార్ తాండూరు, పరిగి, చేవెళ్ల సభలలో ప్రచారం

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లో తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. ఖర్గే ఎల్లుండి ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సంగారెడ్డిలో కార్నర్ మీటింగ్, నర్సాపూర్‌లో సాయంత్రం నాలుగు గంటలకు కార్నర్ మీటింగ్, ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు మెదక్‌లో పాదయాత్ర నిర్వహించనున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ కీలక నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన తాండూరు, పరిగి, చేవెళ్ల సభలలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఖర్గే, డీకే శివకుమార్‌లను రంగంలోకి దింపుతోంది.

Related posts

బీజేపీకి 30 సీట్ల వరకు వస్తాయి… సంకీర్ణ రాజకీయాల్లో ఏమవుతుందో చూడాలి: ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక… వారి కుటుంబం మాత్రమే బాగుపడింది: రేవంత్ రెడ్డి

Ram Narayana

కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనకు చివరి రోజులు …బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా !

Ram Narayana

Leave a Comment