Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పాలేరులో కందాల వ్యూహాత్మక ప్రచారం …

పాలేరులో కందాల వ్యూహాత్మక ప్రచారం …
తనకు తోడుగా కందాల సతీమణి , ఇద్దరు కూతుళ్ళ ,అల్లుళ్లు
ప్రతి గ్రామాన్ని ,ఇంటి తలుపు తడుతున్న కుటుంబసభ్యులు బంధువులు
ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తితంగా ఒక విడత ప్రచారం ..
కేసీఆర్ జీళ్ళచెర్వు సభ తర్వాత ప్రచారంలో స్పీడ్ పెంచిన కందాల

పాలేరులో బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తన ప్రచారాన్ని వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు ..2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై అనూహ్యరీతిలో విజయం సాధించిన కందాల కొద్దినెలలకే కాంగ్రెస్ కు బై చెప్పి గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు…నాటినుంచి నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసిన కందాల ప్రజలకు సహాయం చేయడంలో ముండేవారని పేరుంది… చనిపోయిన ప్రతిపేద కుటుంబానికి పార్టీలు ,కులాలు ,మతాలు చూడకుండా అందించి మహానుభావుడిగా గుర్తింపు పొందారు..తన దగ్గరకు ఎవరు వచ్చిన లేదు కాదు అనే మనస్త్వత్వం కాదు కందాలది…హాస్పటల్ , విద్య , ఉద్యోగం గుడి ,బడి చర్చి ,మసీద్ కోసం సహాయం అడగటమే ఆలస్యం తన దగ్గర ఉన్నదాట్లో వచ్చిన వారు కూరుకున్న దానికన్నా అధికంగా ఇచ్చి కందాల అంటే ఇది అనే చెప్పుకునే విధంగా పేరు తెచ్చుకున్నారు . ఆయనే కాదు ఆయన సతీమణి , ఇద్దరు కూతుళ్లు కూడా తండ్రికి తోడుగా ప్రజల్లో తిరగటం విశేషం …దీంతో కందాల ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు …

తిరిగి ఎన్నికలు వచ్చాయి. కందాల బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీలో దిగారు . నియోజకవర్గంలో తిరుగుతున్నారు …తీరిక లేకండా ఊరూరా తిరుగుతూ గత ఐదు సంవత్సరాలుగా తాను విధంగా సేవచేసింది ప్రజలకు వివరిస్తున్నారు . తన హయాంలో ఆయాగ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ తనకు ఓటువేసి తిరిగి గెలిపించడం ద్వారా కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని విజ్ఞప్తి చేస్తున్నారు..శుక్రవారం నేలకొండపల్లి మండలం అజయ్ తండాకు ఆయన వచ్చే ముందు ఒక కల్చరల్ బృందం ముందుగా చేరుకోవడం అక్కడ కళారూపాలు ప్రదర్శించడం జరుగుతుంది ..తర్వాత కందాల అక్కడకు చేరుకొని కందాల తెలుసా …?ఎవరు ఆయన ఎప్పుడైనా చూశారా …? అంటూ పాలను పలకరించారు .అందుకు అక్కడ చేరిన ప్రజలు మీరే కందాల అంటూ అనడం అక్కడ ఉన్న వారందరిని నవ్వులు పూవించింది… 24 గంటలు కరెంటు కావాలంటే …రైతు బంధు కొనసాగాలంటే …దళిత బంధు కలవాలంటే పెన్షన్లు మరింత పెరగాలంటే కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అహఁధికారంలోకి రావాలని ప్రచారంలో కోరుతున్నారు ..

Related posts

పాలేరులో ఉమ్మడి అభ్యర్థి పొంగులేటిని గెలిపించండి ;సిపిఐ సమావేశంలో పోటు ప్రసాద్..

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల కృతజ్ఞత లేఖ..యధాతధంగా…

Ram Narayana

తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసుల సోదాలపై మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు…

Ram Narayana

Leave a Comment