Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

ప్రచార వాహనంపై నుంచి పడిన ఘటన… స్పందించిన మంత్రి కేటీఆర్

  • ఆర్మూర్ ‌లో సడన్ బ్రేక్ వేయడంతో ప్రచార వాహనంపై నుంచి పడిన కేటీఆర్, జీవన్ రెడ్డి
  • అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదన్న మంత్రి కేటీఆర్
  • తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఎన్నికల ప్రచార వాహనం రెయిలింగ్ కూలి బీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి జీవన్ రెడ్డి, మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్ రెడ్డి తదితరులు వాహనం పైనుంచి కిందపడ్డారు. దీంతో కేటీఆర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

Related posts

రేపల్లె సికింద్రాబాద్ రైల్లో పెద్ద శబ్దాలతో ఎగిసిపడిన మంటలు ..రైలు నిలిపివేత

Ram Narayana

ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం… 66 మందిని రక్షించిన రెస్క్యూ టీం…

Ram Narayana

బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలు!

Ram Narayana

Leave a Comment