Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ కేబినెట్ మీటింగ్ దీనికోసమేనేమో: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఎన్నికల ఫలితాల వేళ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకోకూడదన్న ఉత్తమ్
  • తమ గెలుపు ధ్రువపత్రాలను చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని వెల్లడి
  • రాజీనామాలు సమర్పించేందుకు కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టారేమోనని ఎద్దేవా

రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ వికాస్ రాజును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కలిశారు. రైతుబంధు నిధులను ప్రభుత్వం చెల్లించకుండా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు. రైతుబంధు నిధులను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించాలని కోరారు. అసైన్డ్ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించకుండా చూడాలని విన్నవించారు. అసైన్డ్ భూముల రికార్డులను మార్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. 

ఈ సందర్భంగా మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల ఫలితాల వేళ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోకూడదని అన్నారు. రేపు గెలుపు ధ్రువపత్రాలను తమ చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఆర్వోలకు ఆదేశాలను ఇవ్వాలని సీఈవోను కోరామని తెలిపారు. ఎల్లుండి కేబినెట్ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని… ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని చెప్పారు. బహుశా రాజీనామాలను సమర్పించేందుకు చేసి ఉండొచ్చేమోనని ఎద్దేవా చేశారు. 

Related posts

కేసీఆర్ తీరుపై తుమ్మల ఫైర్

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ ఫైర్

Ram Narayana

 మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణం: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment