Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

రాష్ట్రంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించిన సీఎం జగన్

  • ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • జోరు పెంచిన వైసీపీ
  • పలు కీలక నియోజకవర్గాలకు ఇన్చార్జిల నియామకం

ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, వైసీపీ సన్నాహకాల్లో జోరు పెరిగింది. తాజాగా, రాష్ట్రంలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఎం జగన్ నేడు ఇన్చార్జిలను నియమించారు. ఈ మేరకు ఆయన పార్టీ పరంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో శ్రేణులను విజయవంతంగా నడిపించడం… ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని, ఆ మేరకు సామర్థ్యం ఉన్న వారిని ఇన్చార్జిలుగా నియమిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.

నియోజకవర్గం – ఇన్చార్జి పేరు

1. ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్
2. కొండేపి- ఆదిమూలపు సురేశ్
3. వేమూరు- వరికూటి అశోక్ బాబు
4. తాడికొండ- మేకతోటి సుచరిత
5. సంతనూతలపాడు- మేరుగు నాగార్జున
6. చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు
7. గుంటూరు (వెస్ట్)- విడదల రజని
8. అద్దంకి- పాణెం హనిమిరెడ్డి
9. మంగళగిరి- గంజి చిరంజీవి
10. రేపల్లె- ఈవూరు గణేశ్
11. గాజువాక- వరికూటి రామచంద్రరావు

కాగా, వీటిలో ప్రత్తిపాడు, కొండేపి, వేమూరు, తాడికొండ, సంతనూతలపాడు నియోజకవర్గాలను ఎస్సీ రిజర్వ్ స్థానాలుగా పేర్కొన్నారు.

Related posts

 ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు

Ram Narayana

కూటమి ప్రభుత్వ ఇసుక విధానంపై జగన్ ఫైర్

Ram Narayana

నారా లోకేశ్ రాకతో పోటెత్తిన ప్రకాశం బ్యారేజి… ఫొటోలు ఇవిగో!

Ram Narayana

Leave a Comment