తెలంగాణ రాజకీయ వార్తలు ..

కవిత ‘బీఆర్ఎస్’ అనబోయి ‘బీజేపీ’ అన్నట్లుగా ఉంది: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు…

  • కవిత పార్టీని స్థాపిస్తే భూస్థాపితమయ్యేది బీఆర్ఎస్ అన్న రామచందర్ రావు
  • కవిత ఏ పార్టీ నుంచి ఓడిపోయారు, ఎవరి చేతిలో ఓడిపోయారో గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
  • కవిత పార్టీ స్థాపిస్తే తమకు ఏమీ కాదన్న రామచందర్ రావు

మే నెల మొదటి వారంలో తమ పార్టీని ప్రకటిస్తామని తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అవుతుందని చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. కవిత ‘బీఆర్ఎస్’ అనబోయి ‘బీజేపీ’ అన్నట్లుగా ఉంది ఆయన వ్యాఖ్యానించారు. ఆమె పొరపాటున తమ పార్టీ పేరును పేర్కొన్నట్లుగా ఉందని అన్నారు.

కవిత పార్టీని స్థాపిస్తే భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్ తప్ప తమ పార్టీ కాదని ఆయన అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఏ పార్టీ నుంచి ఓడిపోయారు, ఎవరి చేతిలో ఓడిపోయారో ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని రామచందర్ రావు అన్నారు.

కాగా, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ దేశం కోసం, ధర్మం కోసం మొఘలులతో పోరాడారని అన్నారు. ఆయన తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు.

Related posts

షర్మిల తప్పటడుగులు …విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీచేస్తారా …?

Ram Narayana

పార్టీ వద్దుఅనుకుంటే వెళ్ళిపోయినందుకు సిద్ధం …బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!

Ram Narayana

 కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం…!

Ram Narayana