Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

జిల్లాలో మంత్రులు ,తుమ్మల , పొంగులేటి పర్యటనలు

ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖమ్మం వస్తున్నారు …నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వారు జిల్లా కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో పర్యటించనున్నారు …తుమ్మల ఉదయం ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీ సిటీలోని తాని నివాసంలో ఉంటారు …పొంగులేటి తన స్వగ్రామం నారాయణపురం గ్రామంలో అందుబాటులో ఉంటారని వారు క్యాంపు కార్యాలయాలు తెలిపాయి…

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకు తన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో , సాయంత్రం 04.00 గంటల నుంచి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. 2 పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ ,తిరుమలాయపాలెం ,కూసుమంచి మండలాల్లో పర్యటించి ప్రజాపాలన దరఖాస్తుల క్యాంపుల తీరు తెన్నులను పరిశీలించనున్నారు …

  • కొత్త ఏడాదిలో అర్హులందరికీ ఆరు గ్యారంటీలు
  • రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం : తెలంగాణలోని ప్రతి మహిళా మహాలక్ష్మిగా ఉండాలని… రైతన్నలందరికీ భరోసా ఇవ్వాలని… గృహాలన్నీ ‘జ్యోతి’తో వెలగాలని… ప్రతీ కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని… అంతర్జాతీయస్థాయిలో విద్యారంగం వికసించాలని…. ఆరోగ్య ధీమా దక్కాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరికీ ‘చే’యూతనివ్వాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలు నయా జోష్ తో అర్హుల దరిచేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులెవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పథకాలన్నీ వారి చెంతకే చేరేలా పారదర్శక పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. నూతన ఏడాదిలో ప్రతీఒక్కరి మోములో చిరునవ్వు చూడాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు.

Related posts

తెలుగుదేశం పార్టీతో నా అనుబంధం ఎవరు వేరు చేయలేనిది …ఎంపీ నామ

Ram Narayana

సీటీ స్కాన్, టిఫా సేవలు వెంటనే పునరుద్దరణ చేయాలి – CPM

Ram Narayana

ఖమ్మం జిల్లా వార్తలు ……

Drukpadam

Leave a Comment