Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

టెస్ట్ మ్యాచ్ లో మొదటిరోజే రెండు జట్ల అల్ అవుట్

కేప్​టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా అదరగొడుతోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇం​డియా బౌలర్లు ఓ ఆట ఆడేసుకున్నారు. పేస్​కు సహకరిస్తున్న పిచ్​పై నిప్పులు చెరుగుతూ సఫారీ జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేశారు. పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా, జస్ప్రీత్ బుమ్రా 2, ముకేశ్ కుమార్ 2 వికెట్లు దక్కించుకున్నారు.

రెండో సెషన్​లోనే బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా కూడా ఫ్లాట్​ పిచ్​పై పరుగులు చేయడానికి కష్టపడింది. 34.5 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) మాత్రమే రాణించారు. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఇద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. సఫారీ పేసర్ల దెబ్బకు టీమ్ఇండియాలో మొత్తం ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. దీంతో 153 పరుగుల వద్దే భారత్ చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగ్డీ, కగిసో రబాడా, బర్గర్ తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు..

Related posts

ఘనతంతా షమీదే.. ఆ బౌన్సరే నాలోని ఆటగాడిని లేపింది.. హార్దిక్ పాండ్యా!

Drukpadam

గుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకున్నప్పటికీ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ ఎలా దక్కించుకుంది?

Ram Narayana

టీనేజర్ లా సన్నగా మారిపోయిన రోహిత్ శర్మ కొత్త లుక్ !

Drukpadam

Leave a Comment