ఆంధ్రప్రదేశ్కోర్ట్ తీర్పులు

 చంద్రబాబుకు భారీ ఊరట… ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు

  • చంద్రబాబుపై మద్యం, ఐఆర్ఆర్, ఉచిత ఇసుక కేసులు
  • ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు
  • నేడు తుది విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
  • చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వెలువరించిన జడ్జి 

టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన మద్యం అనుమతుల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు  (ఐఆర్ఆర్) కేసు, ఇసుక పాలసీ కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఒకేసారి మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం. హైకోర్టు జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా, మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనరేశ్ కు కూడా బెయిల్ మంజూరైంది.

Related posts

ఎండాడ‌లోని వైసీపీ కార్యాల‌యానికి నోటీసులు!

Ram Narayana

జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో!

Ram Narayana

పెళ్లి కాకుండా బిడ్డను కలిగి ఉంటే తప్పు లేదు..: జయా బచ్చన్

Drukpadam